ఇపుడీ విషయమే అధికార వైసీపీలో హాట్ టాపిక్ అయిపోయింది. తొందరలోనే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళనకు రెడీ అవుతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. దీనికి తగ్గట్లే మంత్రి సీదిరి అప్పలరాజు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ శుక్రవారం జగన్ను కలవటంతో టెన్షన్ పెరిగిపోతోంది. మంత్రి సీదిరి క్యాంపాఫీసులో జగన్ను రెండుసార్లు కలిశారు. దాంతో సీదిరికి ఉధ్వాసన తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. మరి స్పీకర్ ఎందుకు కలిసినట్లు ?
ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే శనివారం మరో ముగ్గురు మంత్రులను క్యాంపాఫీసుకు రమ్మని సమాచారం అందినట్లు పార్టీవర్గాల్లో ప్రచారం మొదలైంది. ఎందుకు ముగ్గురు మంత్రులను వచ్చి జగన్ కలవమన్నారనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. మంత్రివర్గం నుండి ఉధ్వాసన చెప్పబోతున్న వాళ్ళని వ్యక్తిగతంగా పిలిపించుకుని జగన్ మాట్లాడుతున్నట్లు సమాచారం. క్యాబినెట్లో నుండి ఎందుకు తప్పిస్తున్నారనే విషయాన్ని నచ్చచెప్పేందుకే జగన్ క్యాంపాఫీసుకు పిలిపించుకుంటున్నట్లు పార్టీ నేతలను అనుమానం వ్యక్తంచేశారు.
గతంలో కూడా జగన్ ఇదే పద్దతిని పాటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉధ్వాసనకు చాలా కారణాలే ఉన్నప్పటికీ ముందస్తుగా వాళ్ళతో మాట్లాడి కన్వీన్స్ చేయాలన్నది జగన్ ఆలోచన. అయితే జగన్ ఒకటి అనుకుంటే మరోటి జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో తమను క్యాబినెట్ నుండి బయటకు పంపేయటాన్ని ఎవరైనా అవమానంగా భావిస్తే అప్పుడు వాళ్ళు ఎలా రియాక్టవుతారో ఎవరు చెప్పలేరు.
ఎందుకంటే ఇపుడు మంత్రిపదవి నుండి తీసేసిన వాళ్ళల్లో రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏ టికెట్ ఇస్తారో లేదో అనే అనుమానాలూ పెరిగిపోతాయి. పనితీరు బాగా లేదని క్యాబినెట్ నుండి పక్కన పెట్టేస్తే ఇదే సూత్రం రేపటి టికెట్టుకు కూడా అప్లై అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఎవరైనా ప్రిస్టేజిగా తీసుకుంటే వాళ్ళు వెంటనే జగన్ పై తిరుగుబాటు లేవదీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి అలాంటి వాళ్ళకి వైసీపీ ఒకటే పార్టీ కాదు. ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ప్రక్షాళన జరిగిన తర్వాత కానీ ఏమి జరగబోతోంది తెలీదు.