ఇపుడు బయటపడింది నలుగురు ఎంఎల్ఏలు మాత్రమే. అదికూడా ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలు జరిగాయి కాబట్టి. క్రాస్ ఓటింగ్ సందర్భంగా నలుగురు వైసీపీ ఎంఎల్ఏలు టీడీపీ అభ్యర్ధి విజయానికి ఓట్లేయటం వైసీపీలో పెద్ద సంచలనంగా మారింది. ఓటింగ్ కారణంగా నలుగురు ఎంఎల్ఏలు బయటపడ్డారని అయితే అసంతృప్తి ఉండి బయటపడని ఎంఎల్ఏలు ఇంకా ఉన్నారనే చర్చ మొదలైంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది.
సజ్జల మీడియాతో మాట్లాడుతు తమ అభ్యర్ధి విజయానికి చంద్రబాబు వైసీపీలోకి చాలామంది ఎంఎల్ఏలతో మాట్లాడినట్లు చెప్పారు. అయితే చంద్రబాబుతో మాట్లాడిన ఎంఎల్ఏలందరు జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నట్లు కాదని సమర్ధించుకున్నారు. అంటే చంద్రబాబు మాట్లాడిన ఎంఎల్ఏల్లో నలుగురు ఎంఎల్ఏలు టీడీపీ అభ్యర్ధి విజయానికి అనుకూలంగా ఓట్లేసినట్లు తేలిపోయింది. ఈ విషయాన్ని సజ్జల కూడా అంగీకరించారు.
దీన్నిబట్టి చూస్తే పార్టీలో జగన్ పైన ఎంతమంది ఎంఎల్ఏల్లో అసంతృప్తి ఉందనే విషయమై చర్చ పెరిగిపోతోంది. అసలు ఎంఎల్ఏలకు జగన్ పైన అసంతృప్తి ఉండటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే వివిధ కారణాలతో రాబోయే ఎన్నికల్లో తమకు టికెట్లు రావని కొందరు ఎంఎల్ఏలకు అనుమానాలు మొదలయ్యాయట. రెగ్యులర్ గా సర్వేలతో ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని జగన్ చాలాసార్లు చెప్పారు. పనితీరు బాగాలేని వారికి టికెట్లు ఇచ్చేదిలేదని స్పష్టంగా చెప్పేశారు.
దాంతో వచ్చేఎన్నికల్లో తమకు టికెట్లు రావనే విషయంలో కొందరు ఎంఎల్ఏలకు అనుమానాలు పెరిగిపోతున్నాయట. ఇపుడు క్రాస్ ఓటింగ్ చేసిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిదిక డా అదే బాపతు. ఎలాగూ టికెట్లు రావని నిర్ధారణ అయిపోవటంతోనే వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారని తేల్చారు. మిగిలిన ఎంఎల్ఏలకి వీళ్ళకి తేడా ఏమిటంటే వీళ్ళిద్దరు ఎంఎల్ఏలపై నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. రెగ్యులర్ గా ఏదో ఒక వివాదంలో ఉంటునే ఉన్నారు. వీళ్ళతో పోల్చుకుంటే కొందరు ఎంఎల్ఏలు నయమనే చెప్పాలి. అందుకనే మరికొందరి టికెట్ల విషయంలో జగన్ తేల్చిచెప్పలేదు.