ఎంపీ అవినాష్ రెడ్డి కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. అవినాశ్ రెడ్డి మధ్యంతర పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.
హైకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డి సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో కోర్టు జోక్యం అవసరం లేదని హైకోర్టు తెలిపింది. అయితే… దూరం నుంచి ఆయన లాయర్ కు కనపడేలా అవినాష్ ను విచారణ చేయమని మాత్రం హైకోర్టు సీబీఐకి సూచించింది.