నిర్మోహమాటంగా మాట్లాడతారన్న పేరున్న చిత్ర ప్రముఖుల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. అలాంటి ఆయన గడిచిన కొద్దికాలంగా మాట్లాడే మాటల మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మాట్లాడటం తప్పు కాదు కానీ.. మాట్లాడే సమయం.. సందర్భం చాలా ముఖ్యం. కొన్ని కీలక ఆరోపణలు చేసే వేళలో.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే కన్నా.. ఆచితూచి అన్నట్లు మాట్లాడితే బాగుంటుంది. కానీ.. ఆ విషయంలో తనకున్న హద్దుల్ని ఆయన మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.
తాజాగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా బడ్జెట్ల గురించి మాట్లాడుతూ.. రాజమౌళి నిర్మించిన సినిమాల గురించి మాట్లాడారు. రూ.200కోట్లతో బాహుబలి తీశారని.. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ బడ్జెట్ అని.. కానీ.. సక్సెస్ ఫుల్ మూవీని రాజమౌళి తీశారు కాబట్టి ఆయన గొప్పోడంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ మాటల్లో కాసిన్ని చురకలు ఉన్నప్పటికీ.. పోన్లే అని సరిపెట్టుకోవచ్చు.
కానీ.. ఆ తర్వాత మాటలే అభ్యంతరకరంగా మారాయి. రూ.600 కోట్లు పెట్టి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ మీద ఆయన వ్యాఖ్యలు చేశారు. అస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారని.. అదే మొత్తాన్ని తనకు ఇస్తే 8 సినిమాలు తీసి వాళ్ల ముఖాన కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ అస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారన్న తమ్మారెడ్డి మాటలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై నాగబాబు దిమ్మ తిరిగిపోయేలా రియాక్ట్ అయితే.. వివాదాల మీద పెద్దగా నోరు విప్పని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రియాక్టు అవుతూ తన రోటీన్ తీరుకు భిన్నంగా స్పందించారు.
సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘‘మిత్రుడు భరద్వాజ్ కు, తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి.. తెలుగు దర్శకుడికి.. తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి. అంతేకానీ రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా?’’ అంటూ ఫైర్ అయ్యారు. తన ఫైరింగ్ కు కొనసాగింపుగా.. ‘‘జేమ్స్ కామెరూన్.. స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా?’’ అంటూ విషయంలోకి పెద్ద తలకాయల్ని లాగటం ద్వారా.. మళ్లీ మాట్లాడని రీతిలో రియాక్టు అయ్యారంటున్నారు.
రాఘవేంద్రరావు చేసిన ట్వీట్ కు సినీ అభిమానుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. అందరూ ఆర్ఆర్ఆర్ కు అస్కార్ రావాలని బలంగా అనుకుంటున్న వేళ.. తమ్మారెడ్డి భరద్వాజ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పు పడుతున్నారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పేనని స్పష్టం చేస్తున్నారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలు రాఘవేంద్రరావుకే ఇరిటేషన్ వచ్చిందంటూ పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఒక నెటిజన్ కామెంట్ చేసినా.. దాని లెక్కలు దానికే ఉన్నాయని మాత్రం చెప్పాలి.
మిగిలిన లెక్కల సంగతి ఎలా ఉన్నా.. అస్కార్ బరిలోకి దిగటమే కాదు.. దూసుకెళుతున్న ఆర్ఆర్ఆర్ గురించి తమ్మారెడ్డి వ్యాఖ్యల్ని మాత్రం సమర్థించలేం. తెలుగు సినిమాకు.. భారతీయ సినిమాకు కీలక దశలో ఉన్న వేళ.. నోటికి వచ్చినట్లుగామాట్లాడటం తమ్మారెడ్డి చేసిన తప్పే అవుతుంది. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై రాఘవేంద్రరావు రియాక్టు అవుతూ చేసిన ట్వీట్ కు కొందరు నెటిజన్లు మరింత మాస్ గా రియాక్టు అవుతున్నారు. ‘అది అట్టా దింపు తాత’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
తమ్మారెడ్డి వ్యాఖ్యలకు మెగా ఫ్యామిలీ నుంచి రియాక్షన్ వచ్చేసింది. అసలే ఊర మాస్ గా రియాక్టు అయ్యే ఆయన.. తాజా ఎపిసోడ్ లో మరింత మాస్ గా స్పందించారు. ట్విటర్ లో ట్వీట్ చేసిన ఆయన.. ‘‘నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు ఆర్ఆర్ఆర్ కు అస్కార్ కోసం’’ అంటూ చెలరేగిపోయిన ఆయన.. దానికి బ్రాకెట్లో.. ‘‘ఆర్ఆర్ఆర్ మీద కామెంట్ కు వైసీపీ వారి భాషలో సమాధానం’’ అంటూ పోస్టు పెట్టేశారు. ఈ ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
దీనికి ఒక నెటిజన్ రియాక్టు అవుతూ.. ‘ఎవరు ఊహించని ఒక చక్కటి షాట్ తో సిక్స్ కొట్టి ఆటను ముగించారు’ అని పేర్కొంటే.. ‘‘బొక్కలో ఏపీ సీఎం కోర్టు ఖర్చులకు.. తాడేపల్లి + ఇడుపులపాయ ఎస్టేట్ లలో కంచెల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. అప్పుడు నిద్రపోయింది….’’ అంటూ తమ్మారెడ్డిని ఉద్దేశించి ఘాటు మాటతో ముగించారు. అనవసరంగా కెలికి నలభై మాటలు అనిపించుకోవటం తమ్మారెడ్డి లాంటి వారికి అవసరమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.