ప్రపంచకుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదేదో వ్యాపారపరమైన సమస్యలతో టెన్షన్ పెరగటం కాదు. వ్యక్తిగతంగా ఆయన్ను లేకపోతే ఆయన కుటుంబాన్నో టార్గెట్ చేయటం వల్ల వాళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
ఆమధ్య వాళ్ళ ఇంటిముందు భారీగా పేలుడు పదార్ధాలుంచిన వాహనాన్ని నిలిపిన విషయం తెలిసిందే. ఆ వాహనాన్ని గుర్తించిన కుటుంబసభ్యుల సెక్యురటి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో మొత్తం పోలీసు వ్యవస్ధే రంగంలోకి దిగింది.
పెద్ద ఎత్తున దర్యాప్తు చేసిన తర్వాత ఆ వాహనం పార్కింగ్ విషయంలో స్వయంగా ఓ పోలీసు ఉన్నతాధికారి పాత్రకూడా ఉందని తేలింది. దాంతో ఈ ఘటనలోని పాత్రదారులందరినీ గుర్తించేందుకు పోలీసు ఉన్నతాధికారులు నానా అవస్తలు పడుతున్నారు. అప్పట్లోనే నిలిపుంచిన వాహనంలో ముఖేష్ కుటుంబానికి తీవ్ర హెచ్చరికలు అందాయి.
సరే ఆ దర్యాప్తు జరుగుతుండగానే తాజాగా ఓ మోటారు సైకిల్ ను గుర్తించారు. ఈ మోటారుసైకిల్ కూడా ముఖేష్ ఇంటి దగ్గరే పార్క్ చేసుంది. బైక్ మీదున్న నెంబర్, ఛాసిస్ లాంటి ఆధారాలతో రవాణాశాఖలో పరిశీలిస్తే నెంబర్ బోగస్ అని తేలింది.
ఛాసిస్ ఆధారంగా యజమాని వివరాలు తెలుసుకునేందుకు వీలుపడలేదు. మొత్తంమీద ముఖేష్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకునే ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నట్లు అర్ధమైపోతోంది. చివరకేమవుతుందో చూడాలి.