టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుంగనూరు గుండా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిపై లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుంగనూరు నియోజకవర్గం అంతా తానే అనే ముద్రను పెద్దిరెడ్డి వేసుకోవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, జగన్ జైలుకు ఎప్పుడు వెళ్తారా, ఆ సీఎం సీట్ లో తాను ఎప్పుడు కూర్చుందామా అని పెద్దిరెడ్డి ఊహల్లో తేలుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దిరెడ్డి దోచుకున్నదంతా కక్కిస్తానని లోకేష్ అన్నారు. ఇక, రాష్ట్రంలో వైసిపి నేతల జే బ్రాండ్స్, నకిలీ మద్యం ఏరులై పారుతుందని లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగానే పుంగనూరులో జే బ్రాండ్స్ మద్యం తరలిస్తున్న వాహనం పక్కన నిల్చుని లోకేష్ సెల్ఫీ దిగారు. బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్ హౌస్ వంటి బ్రాండ్లను పెద్దిరెడ్డికి చెందిన కంపెనీలు తయారు చేస్తున్నాయని లోకేష్ ఆరోపించారు.
మద్యం తయారు చేస్తున్న సంస్థలకు దుర్మార్గుడైన ఈ పెద్దిరెడ్డి సహయజమానిగా ఉన్నారని, చీప్ లిక్కర్ ప్యాక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ నకిలీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్మంతా తాడేపల్లిలోని పెద్దలకు చేరుతోందని, అమాయకుల ప్రాణాలతో వ్యాపారం చేసి ఈ డబ్బు దండుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు.