ఎటు విన్నా..ఎటు చూసినా జగన్ నామ స్మరణో..లేక వైసీపీ నేతల నామ స్మరణో ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తోంది. ఆ మాటకొస్తే.. తెలంగాణ కూడా తక్కువేమీ కాదు. ఏకంగా..అక్కడ ఐఏఎస్లు.. అంటే.. ఒక జిల్లా మొత్తా న్ని శాసించి పాలించే అధికారం కట్టబెట్టిన.. రాజ్యాంగ స్థాయి అధికారులు.. ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కు తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న రెండు పరిణామాలు.. మరోసారి ఏపీలో ఇం త జపం ఎందుకు? అనే చర్చకు దారితీసింది.
ఐఏఎస్లు.. ఐపీఎస్లు.. సీఎం జగన్ కనుసన్నల్లో నడుస్తున్నారనే విమర్శలు చాలా రోజుల నుంచి విని పిస్తున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు.. అనేక మంతి ఐఏఎస్లు.. ఐపీఎస్ల పేర్లను కూడా వివ రించి.. వీరంతా తాడేపల్లి ప్యాలెస్ ఉద్యోగులు అంటూ విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది. ఇక, ఐపీఎస్లు కూడా .. ఇలానే దూకుడు ప్రదర్శిస్తున్నారని.. టీడీపీ నాయకులు చెబుతున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి నుంచి పై స్థాయి వరకు కూడా చాలా మంది ఇలానే వ్యవహరిస్తున్నారనేది టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు.
ఇదిలావుంటే, ఇప్పుడు ఈ జాడ్యం కింది స్థాయి అధికారులకు కూడా పట్టుకుంది. తాజాగా శ్రీశైలం దేవస్థానం.. ఈవో లవన్న..ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కితే తప్పులేదని వ్యాఖ్యానించారు. ఏకంగా ఆయన పాదాలకు నమస్కారం కూడా చేశారు. ఇక, గతంలో కాణిపాకం వినాయక దేవాలయానికి ఈవోగా ఉన్న సురేష్ బాబు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. సరే.. ఆయనపై ఎలానూ వివాదాస్పద అధికారిగా పేరుండడంతో ఆయన విషయం పెద్దగా హైలెట్ కాలేదు.
ఇక, విశాఖలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్.. కూడా అపరిమిత భక్తివాత్సల్యా లను ప్రదర్శిస్తుండడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆయన ఏం చేసినా.. జగన్ జపం.. ఆయనేం మాట్టాడినా.. వైసీపీ గెలుపు.. ఇవి తప్ప.. ఏమీ ఉండవనే పేరు తెచ్చుకున్నారు. విశాఖలో కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అభ్యర్థులను కూడా విశ్వవిద్యాలయంలోనే ఖరారు చేశారట. ఇక, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను కూడా తానే భుజాలపై మోస్తున్నారట. సో.. మొత్తంగా ఏపీలో స్వామి భక్తి పరాయణులు పెరుగుతున్నారన్నమాట.