ఆమె కుమార్తె అలాంటి ఇలాంటి ఉద్యోగం కాదు. తప్పులు చేసే వారి లెక్కలు తేల్చి.. నేరస్తుల్ని కటకటాల వెనక్కు పంపే ఉద్యోగిణిని. పోలీసు శాఖలో ఎస్ఐగా వ్యవహరిస్తున్న కుమార్తె భవిష్యత్తు ఏమవుతుందన్నది కూడా ఆలోచించకుండా చేసిన పని బయటకు వచ్చి.. అందరిని నిర్ఘాంతపోయేలా చేస్తోంది. తిరుపతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
తిరుపతి ముత్యాలరెడ్డి పల్లి పోలీసులు ఒక ఇంటి మీద తనిఖీలు నిర్వహించారు. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా చేసుకొని ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా.. అక్కడ వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిజం బయటకు వచ్చింది. నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్న మహిళను.. ఆమె తమ్ముడిని.. ఒక విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు యువతుల్ని రెస్క్యూ హోంకు తరలించారు.
ఇంతకూ ఈ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న మహిళ మరెవరో కాదు.. ఒక మహిళా ఎస్ఐ తల్లి అన్న విషయం బయటపడటంతో పోలీసులు సైతం షాక్ తింటున్నారు. సదరు మహిళా ఎస్ఐకు ఏడాది క్రితం పెళ్లి కావటంతో ఆమె తల్లి నుంచి దూరంగా ఉంటూ.. భర్తతో కలిసి జీవిస్తోంది.
ఈ విషయంలో ఆమె పాత్ర ఏమీ లేకపోవచ్చు కానీ.. కుమార్తె జీవితానికి కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టేలా.. ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన ధోరణిపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ఉదంతానికి సంబంధించిన కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. తల్లి కారణంగా సదరు మహిళా ఎస్ఐ మరెన్ని సమస్యలు ఎదుర్కొంటారో అన్న మాట వినిపిస్తోంది.