పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఇది సాధారణ వార్త.
అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మార్పు కూడా ఉంది … ఇది సాధారణ వార్త కాదు.
ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఇటీవల ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఆయన ఒకరు కావడం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
తాజాగా నియామకాల్లో మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ బైస్ నియమితులయ్యారు.
ఇటీవల వరుస పరిణామాలు గమనిస్తే… ఏపీ ప్రజల మూడ్ కి అనుగుణంగా బీజేపీ మనసు మార్చుకున్న విషయం అర్థమవుతోంది.
తొలుత…. వివేకా సీబీఐ కేసును స్పీడ్ చేసింది.
తర్వాత అమరావతియే రాజధాని అని స్ట్రాంగ్ గా చెప్పింది.
తాజాగా జగన్ ఏం చెబితే దానికి తలూపే గవర్నర్ ను మార్చేసింది.
అంటే ఏపీ ప్రజలు జగన్ వైపు లేరు అన్న వెంటనే జగన్ వెంట ఉంటే తమకూ నష్టమే అని బీజేపీ దూరం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందులో భాగమే ఈ తాజా పరిణామాలు అని జనంలోనూ చర్చ జరుగుతోంది.