2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దాదాపు మూడు లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ను హరీష్ ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 2,90,396 కోట్ల జంబో బడ్జెట్ ను హరీశ్ శాసన సభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 37,525 కోట్లు. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు రాబోతోన్న నేపథ్యంలో భారీ బడ్జెట్ ను తీవ్ర కసరత్తు చేసి ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ బడ్జెట్ లో రైతులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రైతులు చాలాకాలంగా వేచిచూస్తున్న రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయిస్తున్నట్టు హరీష్ రావు ప్రకటించారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ. 26,931 కోట్లకు ఇది అదనం కావడం విశేషం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాఖలవారీగా అన్ని వర్గాలను ఆకట్టుకునేలాగా తెలంగాణ ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు
షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
నీటి పారుదల రంగంకు రూ. 26,885 కోట్లు,
వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు
విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ. 15, 233
విద్యుత్ రంగం రూ. 12,727 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
హోంశాఖకు రూ.9,599 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 6,229 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
రైతు బంధు పథకంకు రూ. 1,575 కోట్లు
రైతు బీమా పథకంకు రూ. 1,589 కోట్లు
ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంకు రూ. 200 కోట్లు