ఆంధ్రప్రదేశ్ అభద్రతలో ఉందా? ఇక్కడి ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేదా? అంటే.. ఔననే అంటున్నారు పొరుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు. త్వరలోనే కర్ణాటక ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ కా నుంది. ఈ ఏడాది మేలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సరిహద్దు జిల్లాల్లోని కర్ణా టకలో.. కొందరు ప్రధాన ప్రతిపక్షం జేడీఎస్ నాయకులు.. కొన్ని సంచలన ప్రకటనలు జారీ చేశారు. ఏపీలో అభద్రతా భావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
అంతేకాదు.. “ఏపీలో మాదిరిగానే మన దగ్గరా పరిస్థితి ఉంది. ఏపీలో ప్రజలు ప్రభుత్వంపై మాట్టాడేందు కు.. భయపడుతున్నారు. ఇక్కడ కూడా దానికి భిన్నంగా ఏమీ పరిస్థితి లేదు. అందుకే.. సీఎం బొమ్మైను విమర్శించాలన్నా.. ప్రతిపక్షాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. ఈ సీఎం మనకు అవసరమా?“ అని జేడీఎస్ కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో రియాక్షన్ వచ్చింది.
నిజానికి ఏపీలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. పైకి భావప్ర కటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. అంతర్గతంగా చూసుకుంటే.. సీఎంను కానీ, ఆయన పథకాలను కానీ ఎవరై నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే.. తక్షణం పోలీసులు తాఖీదులుఇస్తున్నారని..అంతేకాదు.. అరెస్టులు కూడా జరగుతున్నాయనేది.. ప్రతిపక్షాల మాటే కాదు.. ప్రజాస్వామ్య వాదుల మాటగా కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాల నేతల మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదిలావుంటే.. మరోవైపు.. జీవో 1 ద్వారా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎవరూ గళం వినిపించకుం డా.. వైసీపీ ప్రభుత్వం అణిచివేత ధోరణిని ప్రదర్శిస్తోందని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం గా చూస్తే.. స్వేచ్ఛగా మాట్లాడేందుకు.. స్వేచ్ఛగా నిరసన తెలిపేందుకు కూడా ఎలాంటి అవకాశం లేకుం డా పోయిందనే భావన వ్యక్తం అవుతుండడం గమనార్హం.