ఆంధ్రుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా Los Angeles NRI TDP కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
40 సంవత్సరాల క్రితం అన్నగారు పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో రూపొందించిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం స్ఫూర్తితో ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టినట్టు ఎన్నారై టిడిపి నాయకత్వం తెలియజేసింది.
అన్నదాన కార్యక్రమానికి ముందు టిడిపి మరియు ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించి జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే, జై టిడిపి అని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో లాస్ ఏంజిల్స్ లోని 200 మందికి పైగా గూడు లేని పేద నిరాశ్రయలకు అమెరికా ఆహార పదార్థాలైన బరిటోస్, చిప్స్, బనానా వాటర్ అందించడం జరిగింది.
లైఫ్ ఆన్ ది స్ట్రీట్స్ ప్రతినిధి క్రిస్టల్ మాట్లాడుతూ LA ఎన్నారై టిడిపి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, 27 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని ఇప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే అది ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు ఎన్టీఆర్ చిత్రపటాలను చూసి ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవటం విశేషం.
చందు నంగినేని గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ ని స్మరించుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చి అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం విజయవంతంగా చేసిన LA NRI TDP కార్యవర్గ సభ్యులు విష్ణు అటుకారి, రాహుల్ వాసిరెడ్డి, సురేష్ అంబటి మరియు హేమ కుమార్ గొట్టి లను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎన్నారై టిడిపి కార్యకర్తలు ప్రసాద్ పాపుదేశి, రంగారావు నన్నపనేని, రామ్ ఎలమంచిలి, స్వరూప్ ఏపూరి, సురేష్ కందెపు, అజయ్ చావా , శ్రీధర్ పొట్లూరి, నరసింహారావు ప్రత్తిపాటి , సతీష్ గుండపనేని, సునీల్ పతకమూరి, హరి మాదాల, ప్రతాప్ మేదరమెట్ల, విష్ణు యలమంచి , రాజేష్ యడ్లపాటి, రమేష్ మద్దినీడి తదితరులు పాల్గొనడం జరిగింది