బీఆర్ఎస్ ( BRS ) అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. విజయం సంగతి ఎలా ఉన్నా… ప్రయత్నం చేయడంలో మాత్రం కేసీఆర్ హడావుడి మామూలుగా లేదు. కాన్పిడెన్స్ అయితే పీక్స్ లో ఉంది.
ఈరోజు కేసీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభను ఖమ్మం లో నిర్వహించారు. దేశాన్ని ఆకర్షించడానికి ఉత్తరాది నేతలను పిలిచారు. దేశవ్యాప్తంగా నలుగురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని ఏ విధంగా నాశనం చేశాయో వివరిస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ పార్టీలన్నీ ఎన్నికల ముందు ఒకరినొకరు నిందించుకోవడం, ఓట్లు అడుక్కోవడమేనని కేసీఆర్ అన్నారు.
“2024లో మనం ఢిల్లీకి వెళ్తున్నాం, మోడీ ఇంటికి వెళ్తాడు అంటూ స్లోగన్ వినిపించాడు కేసీఆర్. మోదీ అసమర్థతను సహించేది లేదు. దేశవ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేయాలని, ఏడాదికి 25 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని బీఆర్ఎస్ ఇప్పుడు మోదీని డిమాండ్ చేస్తోంది అన్నారు. దీనిని మోడీ చేయకపోతే మేం చేస్తాం’’ అని కేసీఆర్ ప్రకటించారు.
“BJP ఉద్దేశ్యం నష్టాల సామాజికీకరణ మరియు లాభాల ప్రైవేటీకరణ. ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంది. మేము అలా జరగనివ్వము. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేస్తాం’’ అని కేసీఆర్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు వచ్చిన మీటింగ్ కు టీఆర్ఎస్ సోషల్ మీడియా భారీ ఎలివేషన్లు ఇస్తోంది. ప్రకాష్ రాజ్ డైలాగును వాడేసి తెగ పొగుడుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Not trying to be sarcastic????????But @bandisanjay_bjp and batch should hire some one to count ????????
Congratulations ????????????#BRSParty
What a hard hit sir #KCR ????@KTRTRS ????@BRSTechCell @BRSParty_News pic.twitter.com/iNOIM9lDVW— Srinivas Potti (@SrinivasBRSUSA) January 18, 2023