దేశం దృష్టిని తన వైపు తిప్పుకునేలా తెలంగాణ అధికార పార్టీ భారత రాష్ట్రసమితి.. బీఆర్ ఎస్ ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ముందుగా ఈ రోజు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కలిసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లు యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు.. స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అంతకుముందు ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన అల్పాహార విందులో అతిథులు పాల్గొన్నారు. విందు సమయంలో జాతీయ రాజకీయాలు, సంబంధిత అంశాలపై ఈ నేతలు చర్చించారు. విందు అనంతరం.. బేగంపేట నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్లలో ముఖ్యమంత్రులు, ఇతర నేతలు యాదాద్రికి వెళ్లారు.
యాదాద్రి చేరుకున్న నేతలంతా నేరుగా ప్రెసిడెన్షియల్ సూట్లకు చేరుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో కేసీఆర్ సహా కేజ్రీవాల్, భగవంత్ మాన్, అఖిలేశ్ యాదవ్, డి.రాజా, ఇతర నేతలు పాల్గొన్నారు.
కేసీఆర్ సాబ్ ఆప్ ఆగే బడో
హమ్ సబ్ ఆప్ కే సాత్ హై అంటూ కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో రాణించాలని
నినదిస్తున్న ఖమ్మం సభకు విచ్చేసిన అశేష జనం ✊✊????????#BRSforIndia #BRSParty #KCR pic.twitter.com/HILVBZRKEU— ???????????????????? ???????????????? (@Nallabalu1) January 18, 2023