మకర సంక్రాంతి పండుగ నాడు నేపాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. నేపాల్ లోని పొఖారా ఎయిర్ పోర్టులో విమానం కుప్పకూలింది. ల్యాండ్ కాబోతున్న విమానం కుప్పకూలడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులను కాపాడేందుకు స్థానికులు, సహాయక సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్ లైన్స్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా విమానం రన్ వేపై కుప్పకూలిపోవడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. ఈ ఘటన జరిగిన వెంటనే పొఖారా ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అయితే, ఈ విమానం కుప్పకూలిపోవడానికి గల కారణాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
ఇక, ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారు అన్న వివరాలను కూడా ప్రభుత్వం ఇంకా వెల్లడించాల్సి ఉంది. అయితే, విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల బంధువులు విమానాశ్రయం దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. భారత్ తో పాటు నేపాల్ లోను హిందువులు మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు.
మగర వర్గానికి చెందిన ప్రజలు ఈ పండుగకు తెలుగువారి తరహాలోనే అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పండుగపూట సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటారు. తమ కూతుళ్లను, కొత్త అల్లుళ్లను ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. మఘ అని పిలుచుకునే మకర సంక్రాంతి నాడు ఈ పెను ప్రమాదం జరగడంతో నేపాల్ ప్రజలు విషాదంలో కూరుకుపోయారు.
Another Video.. Plane crash in #Nepal…. A #Yeti Air ATR72 aircraft flying to #Pokhara from #Kathmandu has crashed, Aircraft had 68 passengers pic.twitter.com/kYsFdu4VyT
— Jaya Mishra ???????? (@anchorjaya) January 15, 2023