తుది గడువు ఇచ్చేశారు. ఈ నెలాఖరుకు.. ఇంకాస్త కరెక్టుగా చెప్పాలంటే మార్చి 31 తేదీ నాటికి ఆదార్ తో పాన్ కార్డు లింకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ లోపు కానీ పాన్ కార్డుతో ఆదార్ లింకు చేసుకోకుంటే.. పాన్ కార్డు చెల్లుబాటు కాదని స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ పలుమార్లు వాయిదాల్ని పొడిగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం అందుకు భిన్నంగా.. ‘లింకు’ తప్పనిసరిగా తేల్చింది.
ఒకవేళ గడువులోపు లింకు చేసుకోకుంటే పాన్ కార్డు చెల్లుబాటు కాకుండా పోతుంది. ప్రతి సందర్భంలోనూ ఉపయోగపడే ఆదార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరు నాటికి లింకు చేసుకోవాల్సిందే. ఒకవేళ అలా అనుసంధానం చేసుకోకపోతే.. రూ.10వేల భారీ జరిమానా విధిస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. పాన్ కార్డు చెల్లుబాటు కాదు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పాన్ కార్డును ఆదార్ తో లింకు చేసుకోవటం తప్పనిసరి చేశారు.
మరి పాన్ ను ఆదార్ తో లింకు చేసుకోవాలని అనుకునే వారు.. ఎవరికి వారుగా చేసుకోవచ్చు. కాకుంటే కాస్తంత ప్రయత్నం చేస్తే.. లింకు చేయటం కష్టమేమీ కాదంటున్నారు. incometaxindiaef