పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా అప్పట్లో సృష్టించిన కలెక్షన్ల సునామీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మళ్లీ కలెక్షన్ల సునామీ సృష్టించేలా కనిపిస్తోంది. 10 రోజుల క్రితం హఠాత్తుగా ఊడిపడ్డట్టు ఇచ్చిన ఖుషీ సెకండ్ రిలీజ్ ప్రకటన అంనాలను మించి రచ్చ చేస్తోంది. ఆన్లైన్లో ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్స్ ఓ రేంజిలో కొనసాగుతున్నాయి.
సినిమా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్ఆయి. నిజానికి సెకండ్ రిలీజ్ ట్రెండ్ బాగా డౌన్ అయిందనుకుంటున్న తరుణంలో పాత సినిమాలను మళ్లీ కొత్తగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడేవారు. వర్షం, బాద్షా, మాయాబజార్, మాయాబజార్, ప్రేమదేశం తదితర సినిమాలకు పెద్ద స్పందన రాలేదు.
చాలా చోట్ల కనీసం ఈ సినిమాలకు థియేటర్ అద్దె లు కూడా గిట్టుబాట కాక రద్దయిన షోలు కూడా ఉన్నాయి. రెండు నెలల క్రితమే తమ్ముడు, జల్సాలను చూసిన పవన్ ఫ్యాన్స్ ఖుషీని ఏమాత్రం ఆదరిస్తారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవయ్యాయి.
అయితే ఆన్లైన్లో ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్స్ సినీ పండింతులను సైతం నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఆన్లైన్లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రధాన నగరాల్లో ఏడెనిమిది షోలు వేసినా అన్ని షోలూ హౌస్‌ఫుల్‌గా నడిచే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇయర్ ఎండింగ్‌ని పవర్ స్టార్ బ్లాక్ బస్టర్‌తో సెలబ్రేట్ చేసుకోవాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో ఈ సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ కనిపిస్తోందని బావిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఓటీటీలోనే కాదు యూట్యూబ్‌లోనే ఈ సినిమా ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. అలాంటిది ఈ సినిమాను ఈ స్థాయిలో చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుండమే ఆశ్చర్యమే.
ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా అంతగా రెస్పాన్స్ సాధించలేదని సమాచారం. అక్కడ సింగిల్ థియేటర్లు తప్ప కార్పొరేట్ చైన్లు ఈ సినిమా మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు.
మరోవైపు ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న భయం థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లలో నెలకొన్నాయి. థియేటర్ల వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు చేసే సందడి, అల్లరిని తట్టుకోవడం సాధ్యమేనా అనే సందేశమాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో థియేటర్ల యజమానులు పవన్ అభిమాన సంఘాల సహాయం తీసుకుని వారి హామీతో షోలు వేయిస్తున్నాయి.
ఇవన్నీ ఎలా ఉన్న 20 సంవత్సరాల క్రితం విడుదలైన ఖుషీ సినిమా బాక్సాఫీసు కలెక్షన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నంకు ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మళ్లీ 20 ఏళ్ల తరువాత కూడా ఈ సినిమా ఈ నిర్మాతకు కాసుల పంట పండించే సూచనలు కనిపిస్తున్నాయి.
https://twitter.com/PKFC_EGodavari/status/1608093203466694661