సూర్యాపేట పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభానికి కాస్త ముందు గ్యాలరీ ఒక్కసారిగా కూలిపోవటం.. వంద నుంచి 150 మంది వరకు గాయాలపాలైతే.. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్రజలు ఉలిక్కిపడేలా చేశాయి. ఇలాంటి ఉదంతం ఎక్కడ జరిగినా.. పక్కరోజు పేపర్లో తాటికాయంత అక్షరాల్లో కాకున్నా.. ఈ ఘటనకున్న సీరియస్ నెస్ కారణంగా అయినా.. మొదటి పేజీలో తప్పనిసరిగా వాడతారు. కానీ.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా తనను తాను చెప్పుకునే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో మాత్రం మొదటిపేజీలో ప్రచురించకపోవటం గమనార్హం.
ఒక భారీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలోని లోపాల కారణంగా.. గ్యాలరీ కూలి.. పెద్ద ఎత్తున అమాయక ప్రజలు గాయాల పాలైతే.. దానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటమా? ఇక.. వార్త విషయానికి వస్తే.. నమస్తే తెలంగాణ పత్రిక అనుసరించిన విధానం చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. ఆ పత్రిక 11 పేజీలో ‘ఆట’ పేరుతో ఉండే క్రీడాపేజీలో అప్రాధాన్యత వార్తగా వేశారు. అందులోనూ ఒకటి ఆటకు సంబంధించి వార్త అయితే.. మరొకటి ఆయన గ్యాలరీ పేరుతో చిన్నవార్తగా ప్రచురించారు.
వంద నుంచి నూటయాభై మంది వరకు గాయపడి.. పలువురు తవ్రగాయాలైన వారికిసంబంధించిన వార్తను ఇంతలా ఒక పక్కన పెట్టిన తీరు చూస్తే.. తమ ప్రభుత్వం చేసిన తప్పును కేసీఆర్ ఒప్పుకున్నట్లేనా అన్న భావన కలుగక మానదు. ఎందుకంటే.. ఆయన సొంత పత్రికలో ప్రజలకు సంబంధించిన ఒక వార్త.. అందునా పెద్ద ప్రమాదానికి సంబంధించిన వార్త సింఫుల్ గా తేల్చేయటం విశేషం. దీనికి కారణం.. ఈ పోటీల్ని నిర్వహిస్తున్నది రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావటం గమనార్హం. తన తల్లి సావిత్రమ్మ పేరిట నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ టోర్నీ కావటం.. మంత్రి సొంతంగా నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో ఏర్పాటు చేసిన వేదిక కూలిపోవటంపై విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో ఒక్క పక్కగా ముద్రించారన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది.
క్యూ న్యూస్ లో ఉతికారేసిన మల్లన్న
కొసమెరుపు :
నమస్తే తెలంగాణ రాయకపోతే ప్రజలకు తెలియకుండా పోతుందా? ఇదేం జర్నలిజం? అంతర్జాతీయంగా ప్రతి పత్రికలో రాశారు. ఎందుకంటే అది ఒక అసాధారణ ప్రమాదం. కేవలం నిర్లక్షం వల్ల జరిగిన ప్రమాదం. కొన్ని అంతర్జాతీయ కవరేజీ కింద చూడొచ్చు
Telangana: Several injured as temporary gallery collapses during Kabaddi championship in Suryapet
Track latest news updates here https://t.co/RsceM1wPde pic.twitter.com/B9ZsLd1XF3— Economic Times (@EconomicTimes) March 23, 2021
Several injured after spectator stand collapses during a #kabaddi tournament in Suryapet, #Telangana.#ITVIdeo pic.twitter.com/PfbaYO8P6h
— IndiaToday (@IndiaToday) March 23, 2021
???????? #India: Over 100 spectators were injured after a stand #collapsed during the 47th Junior National Kabaddi Championship in Telangana's #Suryapet on Monday.
by Lin | web video pic.twitter.com/px8W5j39lj
— CCTV Asia Pacific (@CCTVAsiaPacific) March 23, 2021