జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. కన్న బిడ్డల కోసం అలమటించిన తల్లులు ఉన్నారు. జీవితాలను త్యాగం చేసి మరీ పిల్లలను పెంచి పోషించిన మాతృమూర్తులు కూడా మనకు తెలుసు. అయితే, రానురాను.. కన్న తల్లులే కర్కశులు అయిపోతున్నారు.
క్షణికానందం కోసం.. కన్న పేగును కూడా తెంచుకునేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. తాజాగా తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పట్టణంలో జరిగిన చిన్నారి మృతి ఘటనలో చిన్నారి తల్లి ఎంత కర్కశంగా వ్యవహరించిందో తెలిస్తే.. ఆవేదన కలగకమానదు. కేవలం ప్రియుడితో సెక్స్ కోసం.. కన్నబిడ్డను చంపేసింది.
హృదయ విదారకమైన ఈ ఘటన అందరినీ కదిలించి వేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 14 న రెండేళ్ల వయసున్న ప్రియాన్షిక ఫిట్స్ వచ్చి చనిపోయిందని పోలీసులకు సమచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా చిన్నారి గొంతు మీద గాయాలు ఉండడం గమనించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టగా.. కన్నతల్లే బిడ్డను కడతేర్చిన వాస్తవాన్ని వెలుగు చూసింది.
నల్గొండ జిల్లా, నార్కట్ పల్లికి చెందిన ఉయ్యాల వెంకన్నకు, ఇదే జిల్లాకు చెందిన రమ్యకి 2017లో వివాహం అయింది. వారికి శివరాం(5), ప్రియాన్షిక(2) ఇద్దరు పిల్లలున్నారు. వెంకన్న 2020లో కరోనాతో చనిపోయాడు. ఆ తరువాత రమ్య ఇద్దరు పిల్లలతో అత్తవారింట్లోనే ఉండేది. అదే గ్రామానికి చెందిన పెరిక వెంకన్న అనే తన కన్నా వయసులో ఐదేళ్ల చిన్నవాడైన వ్యక్తితో రమ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది.
వెంకన్నకు కూడా అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య వ్యవహారం ఆమె అత్తమామలకు తెలిసింది. దీంతో వారు గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పెట్టి హెచ్చరించారు. అయిన వారిలో ఎటువంటి మార్పు రాలేదు. రమ్య, వెంకన్న ఊరి విడిచి చిట్యాలలో రూం అద్దెకు తీసుకున్నారు. అక్కడ కూడా వీరి వివాహేతర సంబంధం అందరికీ తెలియడంతో ఎవ్వరికి తెలియకుండా నార్కెట్పల్లికి వెళ్లారు. పట్టణంలోని జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఒక ఇంట్లో పోర్షన్ అద్దెకు తీసుకున్నారు.
అక్కడి తాము భార్యభర్తలమని, తమ గ్రామం నేరడం అని చెప్పారు. ఇలా ఆరు నెలలు గడిపారు. రూమ్‌కి వెంకన్న వచ్చినప్పు డు ప్రియాన్షిక ఏడుస్తూ.. భయపడేది. దీంతో వారి వివాహేతర సంబంధానికి ఆటంకం వస్తోందని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొన్నారు. పక్కా వ్యూహంతో ఈ నెల 14న రాత్రి ఏడున్నర సమయంలో ఇద్దరు కలిసి రెండేళ్ల చిన్నారిని బలంగా కొట్టి, ఊపిరి ఆడకుండా చేసి చంపారు. తరువాత ఫిట్స్ వచ్చి చనిపోయిందని అందరికి తెలిపారు.