టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొద్ది రోజులుగా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ మార్మోగిపోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో దిల్ రాజు నిర్మించిన ‘వారసుడు’ సినిమా వ్యవహారం నేపథ్యంలో దిల్ రాజు చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. తమిళంలో విజయ్ నంబర్ వన్ హీరో కనుక సంక్రాంతి బరిలో అజిత్ సినిమా ‘బలగం’ కన్నా వారసుడికే ఎక్కువ థియేటర్లు ఇవ్వాలంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు రెండు ఇండస్ట్రీలలో దుమారం రేపాయి.
ఒకే తేదీన విడుదలయ్యే తమిళ సినిమాల కంటే తెలుగు సినిమాలకు ప్రాధాన్యతనివ్వాలని గతంలో దిల్ రాజు చేసిన కామెంట్లు, ఇప్పుడు వారసుడు వంటి తమిళ హీరో సినిమాకు థియేటర్లు కావాలంటూ దిల్ రాజు చేస్తున్న కామెంట్లపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఆల్రెడీ చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు పోటీగా ‘వారసుడు’కు థియేటర్లు కేటాయించడంపై చాలా రోజుల నుంచి టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
ఇక, విజయ్ తమిళంలో పెద్ద స్టార్ కాబట్టి ‘వారసుడు’కు తమిళనాట ఎక్కువ థియేటర్లు ఇవ్వాలంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అజిత్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యవహారంపై దిల్ రాజు స్పందిస్తూ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మీడియా వాళ్ళు ఏదో ఒకటి గెలుకుతుంటారని, ఆల్రెడీ గెలికింది చాలు అంటూ పాత్రికేయులపై దిల్ రాజు చిర్రుబుర్రులాడారు. బలగం సినిమా గురించి మాత్రమే మాట్లాడుదామంటూ ఆ వివాదంపై మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు దిల్ రాజు సమాధానం దాటవేశారు.
తాను మాట్లాడిన దాంట్లో 20 సెకన్ల వీడియోను మాత్రమే వైరల్ చేసి కాంట్రవర్శీ క్రియేట్ చేశారని దిల్ రాజు అన్నారు. ఆ 20 సెకన్లకు ముందు, వెనుక తాను మాట్లాడింది చూస్తే అసలు విషయం అర్థమవుతుందన్నారు. తాను కావాలని వివాదాలు క్రియేట్ చేసే వాడిని కాదని,ఎవరినీ తక్కువ చేసి మాట్లాడనని చెప్పారు. ఇండస్ట్రీ బాగుండాలని, అన్ని సినిమాలు బాగా ఆడాలని చెప్పారు.