టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. చాలాకాలం వరకు ఈ విషయాన్ని గుట్టుగా దాచారు ఈ ఇద్దరు. ఆ తర్వాత నరేష్ మూడో భార్య రమ్య…వారిద్దరూ ఉన్న హోటల్ గది దగ్గరకు వెళ్లి నానా రచ్చ చేయడంతో ఆ సీక్రెట్ బట్టబయలైంది. ఆ తర్వాత నరేష్, పవిత్రలు పలు సందర్భాల్లో జంటగా కనిపించడంతో మీడియా, సోషల్ మీడియాలో వారిపై ట్రోలింగ్ మొదలైంది.
దీంతో, ఈ వ్యవహారంపై పవిత్రా లోకేష్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారను. ఇక, ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మృతదేహాన్ని చూసేందుకు కూడా వీరిద్దరూ ఆస్పత్రికి జంటగా వచ్చారు. దీంతో, వీరి రిలేషన్ పై పలు వెబ్ సైట్ లు పలు కథనాలు రాశాయి. ఘట్టమనేని కుటుంబంలో నమ్రతకు ఇచ్చిన కోడలు హోదా, తనకూ ఇవ్వాలంటూ పవిత్రా లోకేష్ డిమాండ్ చేసినట్లు కొన్ని యూట్యూబ్ చానెల్స్, వెబ్ సైట్ లలో ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలోనే అది తప్పుడు ప్రచారం అని, ఆ వార్తల్లో నిజం లేదని పవిత్రా లోకేష్, నరేష్ లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నరేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పరువుకు భంగం కలిగించేలా అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ నాంపల్లి కోర్టును ఆయన ఆశ్రయించారు. కొన్ని యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్స్ పై పరువు నష్టం దావా కేసును కోర్టులో ఫైల్ చేశారు. ఈ క్రమంలోనే మొత్తం 12 మందిపై విచారణ చేపట్టాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. గతంలోనూ ఓసారి కోర్టులో కొన్ని వెబ్ సైట్లపై నరేష్ కేసు వేసిన సంగతి తెలిసిందే.