మళ్లీ తెలంగాణ, ఏపీలు కలిస్తే బాగుంటుందంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, తాను చేసిన వ్యాఖ్యలకు అర్థం అదికాదని సజ్జల వివరణనిచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాజకీయాలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో భారత రాష్ట్ర సమితి పార్టీ(బీఆర్ఎస్) పోటీ చేయడం మంచిదేననంటూ సజ్జల వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంలో ఎవరెక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, కానీ, తాము ఏపీకి మాత్రమే పరిమితం అవుతామని చెప్పారు. అందుకే, తెలంగాణలో పోటీ చేసే ఆలోచన లేదని అన్నారు. జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితికి జగన్ మద్దతు కోరితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు లేదని, ఉండబోదని, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సజ్జల అన్నారు.
ఇక, ఏపీ తప్ప మరే రాష్ట్రంలోనూ పోటీ చేయబోమని సజ్జల క్లారిటీనిచ్చారు. అవన్నీ ఊహాగానాలేనని, తాము తమిళనాడులోనూ కూడా పోటీ చేయవచ్చని, కానీ, తెలంగాణనే వద్దనుకున్న వైసీపీ…ఏపీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టందని అన్నారు. అటువంటిది కర్ణాటకే మాదు మరే ఇతర రాష్ట్రంలో అయినా ఎందుకు పోటీ చేస్తామని ప్రశ్నించారు. కర్ణాటకలో వైసీపీ పోటీ చేయబోతోందని సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సజ్జల ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సజ్జల వ్యాఖ్యలతో వైసీపీపై ట్రోలింగ్ జరుగుతోంది. మరో రాష్ట్రంలో పోటీ చేసి గెలిచే సీన్ వైసీపీకి లేదంటోన్న సజ్జల అంటూ కామెంట్లు వస్తున్నాయి.