వచ్చే ఎన్నికల్లో వైసీపీ `వైనాట్ 175` అనే నినాదాన్ని అనుసరిస్తున్నా.. బలమైన టీడీపీ కంచుకోటల్లో మాత్రం ఇది సాధ్యం కాదనేది వాస్తవం. ఇప్పటికే ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. టీడీపీ గెలుస్తుందని భావించే నియోజకవర్గాలు దాదాపు 50కి చేరుకున్నాయి. ఇక్కడ ఎలాంటి వారిని నిలబెట్టినా టీడీపీదే గెలుపు అని అంటున్నారు. వీటిలో ఉభయగోదావరుల్లో ఎలాంటి ప్రయోగాలు చేయకపోతే.. మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుంది.
అదేవిధంగా విజయవాడ తూర్పుతోపాటు.. ఈసారి సెంట్రల్ కూడా టీడీపీకి దక్కుతుంది. గుంటూరులో ఈ లెక్క ఇప్పటికి 8 వరకు చేరింది. గురజాల, వినుకొండ, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, సత్తెనపల్లి, రేపల్లె(సిట్టింగ్), తెనాలి, చిలకలూరిపేట వంటివి తిరిగి టీడీపీకే దక్కనున్నాయి. మంగళగిరిలో మాత్రం ఇప్పటికే గెలుపు ఖాయం అని నిర్దారణ అయిపోయింది.
ఇప్పుడు ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో కీలక నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి చేరిందని అంటున్నారు. అదే బాపట్ల. తాజాగా ఇక్కడ వేగేశ్న నరేంద్ర వర్మపేరును చంద్రబాబు ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇస్తున్నట్టు చెప్పారు. ఇది పార్టీలో మంచి జోష్ తీసుకువ చ్చింది. గత ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు కూడా టీడీపీకి ఇక్కడ పరాజయం చవిచూసేలా చేశా యి.
కానీ, ఇప్పుడు.. ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే(ముందస్తు లేకపోతే) వేగేశ్నను పరిచయం చేయడం, ఆయనకు టికెట్ ఇవ్వడం కలిసి వచ్చే అవకాశం అంటున్నారు. ఎప్పటి నుంచో ఆయన ఇక్కడి ప్రజలతో మమేకం అయ్యారు. ఇంటినే కార్యాలయం చేసుకుని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నేనున్నానంటూ.. ప్రజలకు అన్నివిధాలా సాయం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఉప సభాపతి కోన రఘుపతి గ్రాఫ్ తగ్గిపోయింది. సో.. ఎలా చూసుకున్నా.. ఈ సీటుటీడీపీ పరం కావడం తథ్యమని అంటున్నారు.