చాలాకాలంగా ఏపీ సీఎం జగన్, వైఎస్ షర్మిలల మధ్య గ్యాప్ వచ్చిందిన ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే అన్నాచెల్లెళ్లు ఇద్దరూ విడివిడిగా ఇడుపులపాయకు వెళ్లిన వైనం చర్చనీయాంశమైంది. ఇక, ఇటీవల షర్మిల కారు టోయింగ్ చేయడంపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చినా జగన్ మాత్రం స్పందించలేదు. ఇక, మోడీ సైతం జగన్ కు ఈ విషయం గురించి క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలు మళ్లీ కావలని ఆకాంక్షిస్తోన్న సజ్జలకు గట్టి కౌంటర్ పడింది. ముందు జగన్,షర్మిలలను కలపాలంటూ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య…సజ్జలకు కౌంటర్ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలిపే సంగతి దేవుడికి వదిలేయాలని, ఏపీలో ఉన్న అన్న జగన్ను, తెలంగాణలో ఉన్న చెల్లెలు షర్మిలను కలిపే బాధ్యత సజ్జల తీసుకోవాలని ఆయన చురకలంటించారు. వైఎస్ కుటుంబాన్నే కలపలేని మీరు రెండు రాష్ట్రాలను ఎలా కలుపుతారంటూ ఆయన సూటిగా అడిగిన ప్రశ్న ఇపుడు వైరల్ అవుతోంది.
విభజన హామీలను గాలికొదిలేయాలంటూ లేఖలిచ్చిన జగన్ సర్కార్… ఇప్పుడు ఉమ్మడి ఏపీ అంటూ కొత్త డ్రామా మొదలుబెట్టిందని దుయ్యబట్టారు. అలా సజ్జల వ్యాఖ్యానించడం దారుణమని ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ ఈ కొత్త నాటకానికి తెర తీసిందని నిప్పులు చెరిగారు. జగన్ అధికారంలోకి రాగానే ఏపీ ఆస్తులను తెలంగాణకు ధారాదత్తం చేశారని ఏకిపారేశారు.