మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుటుంబంలో అందరూ నటులే. టాలీవుడ్లో తమకంటూ ఒక ప్రత్యేక కలిగిన కుటుంబం మంచు కుటుంబం. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో విబేదాలు ఎక్కువయ్యాయనే వార్తలు షికారు చేస్తున్నాయి. మంచు మనోజ్ వ్యవహారంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు బాగా పెరిగాయనే ప్రచారం జరుగుతోంది.
మంచు మనోజ్ ఇప్పుడు రెండో పెళ్లి కి సిద్ధ పడుతున్నారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన తరువాత ఒంటరి జీవితం గడుపుతున్నారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉంటుంన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నంద్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు భూమి అఖిల ప్రియ చెల్లెలు భూమా మౌనికా రెడ్డిని పెళ్లాడనున్నాడనే వార్తలు హల్ చల్ చేశాయి. వారిద్దరూ కలిసి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని పెళ్లి పీటలు ఎక్కాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరు కలిసి గుళ్లు, గోపురాలకు, ఫంక్షన్లకు హాజరైన ఫొటోలు నెట్టింట హల్చల్ చేశాయి. అయితే మౌనికారెడ్డికానీ, భూమా అఖిల ప్రియ గానీ ఈ వార్తల గురించి స్పందించలేదు.
ఇలా ఉండగా ఈ పెళ్లికి మంచు ఫ్యామిలీ ససేమిరా అంటోందని సమాచారం. దాంతో మంచు కుటుంబ సభ్యులకు మనోజ్‌కు మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయిలో పెరిగాయని తాజా వార్తలు షికారు చేస్తున్నాయి. మోహన్‌బాబు నుంచీ కుటుంబంలో అందరూ ఈ పెళ్లికి సుతారాము ఇష్టపడటం లేదని, దాంతో మంచు కుటంబంలో మనోజ్ ఒంటరివాడయ్యాడని చెబుతున్నారు.