మనం ఆపరేట్ చేసే పనిలేకుండా…మనిషి మస్తిష్కంలో పుట్టిన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే కంప్యూటర్ లు…మనిషి మెదడుకు కంప్యూటర్ కు అనుసంధానం ఉండేలా ఏర్పాటైన అధునాతన చిప్ లు…ఇటువంటి సీన్లు, థీమ్ లతో హాలీవుడ్ మొదలు టాలీవుడ్ వరకు ఎన్నో సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చాయి. అయితే, ఆ రీల్ లైఫ్ లో సీన్లు రియల్ లైఫ్ లోకి రావడానికి మరో 50 ఏళ్లు పడుతుందేమోనని అంతా అనుకున్నారు.
కానీ, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రం మరో 6 నెలల్లో దీనికి సంబంధించిన ట్రయల్స్ ప్రాక్టికల్ గా మొదలుబెడతామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మనిషి మెదడులో కాయిన్ పరిమాణంలో ఉండే ఓ పరికరాన్నిఇంప్లాంట్ చేసి ఆ పరికరాన్ని కంప్యూటర్ తో అనుసంధానం చేస్తారు. ఆ చిప్ సాయంలో మెదడుకు, కంప్యూటర్ కు మధ్య ఏర్పడ్డ లింక్ ఏర్పడుతుంది. దీంతో, మనిషి మెదడులోని ఆలోచనలు కంప్యూటర్ కు సంకేతాలుగా వెళ్లి వాటికి అనుగుణంగా కంప్యూటర్ పనిచేస్తుంటుంది.
ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ చేపట్టిన ఈ అద్భుత ప్రాజెక్ట్ మరో 6 నెలల్లో పూర్తా కాబోతోంది. ఆ తర్వాత దాన్ని ప్రయోగాత్మకంగా మనిషి మెదడులో ప్రవేశపెడతామని మస్క్ స్వయంగా ప్రకటించారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు ఈ ప్రాజెక్ట్ పత్రాలను సమర్పించామని, మరో 6 నెలల్లో మొదటి న్యూరాలింక్ ను మనిషి మెదుడులో ప్రవేశపెడతామని చెప్పారు. ప్రపంచంలోని మొట్టమొదటి మానవ ఇంప్లాంట్ ను సిద్ధం చేసేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నామని, ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తామని మస్క్ ప్రకటించారు.
త్వరలోనే తాను కూడా ఓ చిప్ ను తన మెదడులో ఇంప్లాంట్ చేయించుకోబోతున్నట్టు చెప్పారు.ఆల్రెడీ కోతులపై న్యూరాలింక్ ఇంప్లాంట్లను ప్రయోగించారు. బేసిక్ వీడియో గేమ్ లను ప్లే చేయడం, కర్సర్ ద్వారా స్క్రీన్ పై కదిలించడం వంటి పనులు కోతుల ఆలోచనలు చేశాయి.