టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విలక్షణ దర్శకుడు, టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ ల కాంబోలో తెరకెక్కిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సినీ తారలు, క్రికెటర్లు ఇలా అందరినీ బన్నీ పుష్ప మేనియా కట్టిపడేసిందంటే ఆ సినిమా జనాలకు ఏ రేంజ్ లో రీచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప చిత్రాన్ని రష్యన్ భాషలో కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
డిసెంబర్ 8న రష్యాలో పుష్ప రష్యన్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే రష్యాలో పుష్ప టీం ప్రమోషన్స్ మొదలుబెట్టింది. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు సుకుమార్, చిత్ర నిర్మాతలలో ఒకరైన రవి శంకర్ లు రష్యాలో సందడి చేస్తున్నారు. డిసెంబర్ 1 , డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రత్యేక ప్రిమియర్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సందర్భంగా పుష్ప టీంతో అభిమానులు కలిసి సినిమా చూసేలా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బన్నీ రష్యన్ భాషలో మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు. పుష్ప లోని ‘తగ్గేదేలే’ సహా పలు డైలాగ్స్ రష్యా భాషలో బన్నీ చెప్పడం విశేషం. తనకు ప్రపంచంలో నచ్చిన ప్లేస్ రష్యా అని, ఈ సినిమా రష్యన్ ప్రజలకు తప్పక నచ్చుతుందని బన్నీ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే రష్యా భాషలో బన్నీ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.