తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఓ సంచలనం. కేసీఆర్ ను ఎదిరించిన మొదటి వ్యక్తి. చాలామందిలో కేసీఆర్ తప్పులను ఎత్తిచూపే ధైర్యం లేక ఎలా పోరాటం చేయాలో తెలియని సమయంలో తీన్మార్ మల్లన్న తెరమీదకు వచ్చాడు. తీన్మార్ మల్లన్నకు సోషల్ మీడియా ద్వారా వారంతా దగ్గరయ్యారు. ఇపుడు తీన్మార్ మల్లన్న మీడియా క్యూ న్యూస్ కు 10 లక్షల మంది ఫాలోయర్లే ఉన్నారంటూ ఇంకా సామాన్యుల్లో అతనికి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానం నుంచి టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. ఆయనను ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నారు అందరూ. కానీ అనూహ్యంగా కోదండరాం కంటే, ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుని కేసీఆర్ కు చెమటలు పట్టించారు తీన్మార్ మల్లన్న.
గ్రాడ్యుయేట్ల ద్వారా లక్ష ఓట్లు తీన్మార్ మల్లన్నకు పడగా… లక్ష 22 వేల ఓట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డికి పడ్డాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి అయిన మల్లన్నకు ఇంత భారీగా ఓట్లు పడటం అత్యంత అసాధారణ విషయం. దీన్ని బట్టి కేసీఆర్ పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది.
తీన్మార్ మల్లన్న ఓడిపోయాడు అనే బాధలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు @QGroupMedia1 @MaharajYellam @Teenmarmallana pic.twitter.com/oa5s02rbPl
— Prashanth Thadoori (@TPrashanth985) March 21, 2021
అయితే, అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. తీన్మార్ మల్లన్న ఓడిపోయాడన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లంకలపల్లికి చెందిన శ్రీశైలం అనే ఓ యువకుడు తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. తీన్మార్ మల్లన్న ఓడిపోయారని తెలుసుకుని అతను తీవ్రంగా మనస్తాపం చెందాడు. ఈ ఉదయం శ్రీశైలం పురుగులమందు తాగాడు. అతన్ని నల్లగొండ ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. మార్గ మధ్యంలో చనిపోయారు.
దీనిపై మల్లన్న స్పందిస్తూ తీవ్ర ఆవేదన చెందారు. దిగ్బ్రాంతికి గురయ్యారు. శ్రీశైలం తనతోపాటు పాదయాత్రలో పాల్గొన్నాడని తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో గడీల పాలన నుంచి విముక్తి కోసం చేస్తున్న పోరాటంలో తనతో పాటు కృషి చేసిన శ్రీశైలం ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని మల్లన్న ఆవేదన వ్యక్తంచేశారు. ఇకపై ఇలాంటితప్పు ఎవరూ చేయొద్దని… ఆత్మహత్య చేసుకోవాల్సింది మనంకాదని, ప్రజలను ఏడిపిస్తున్న పార్టీలను ఆత్మహత్య చేసుకునేలా చేద్దాం అని పిలుపునిచ్చారు.
ఒక ప్రముఖ రాజకీయ పార్టీ కోసమే ఎవరూ చావరు… కానీ ఒక సామాన్యుడి కోసం మరోసామాన్యుడు ఆత్మత్యాగం చేయడం ప్రధాన రాజకీయ పార్టీల్లో భయం పుట్టిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.
https://twitter.com/rajashekar_raaj/status/1373543045862367232
https://twitter.com/DubbakaMuncipal/status/1373521409872293892