జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగనన్న కాలనీల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరంలోని జగనన్న కాలనీలలో పర్యటించిన పవన్… ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో వ్యాంపు కారెక్టర్లు చేసిన సిల్క్ స్మితకు, పవన్ కు పెద్ద తేడా లేదంటూ బొత్స షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ పొలిటికల్ వ్యాంప్ అని సంచలన విమర్శలు చేశారు. ఒకవేళ సిల్క్‌స్మిత జనాల్లోకి వచ్చినా ఇంతకన్నా ఎక్కువ మందే జనం వస్తారని, పవన్‌కు జనం రావడం పెద్ద గొప్పకాదని బొత్స ఎద్దేవా చేశారు. జనాలు వచ్చినంత మాత్రాన నాయకులు కారని, సినిమా వాళ్ళు వస్తే జనాలు వస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఏమన్నా పెద్ద పుడింగా? ఆయన మీద ఢిల్లీలో కంప్లైంట్ చేయాల్సిన అవసరం మాకేంటి అని బొత్స అన్నారు.
పవన్ ది పొలిటికల్ పార్టీ కాదని, సెలబ్రిటీ పార్టీ అని విమర్శించారు. పవన్ మీద ప్రధానికి కంప్లైంట్ చేసేందుకు ఏమీ లేదని బొత్స అన్నారు. పవన్ ఏం సాధిస్తారని ఫిర్యాదు చేస్తామని ప్రశ్నించారు. పవన్ ఏమన్నా యుగపురుషుడా అంటూ బొత్స ఫైర్ అయ్యారు. పవన్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎలా అంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని అన్నారు.
జగనన్న కాలనీలో పదివేల కోట్లు, 15 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం బాధ్యత అనిపించుకోదని పవన్ కు బొత్స హితవు పలికారు. ఆ అవినీతిపై ఆధారాలతో సహా బయట పెట్టాలని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబును పైకి లేపాలని పవన్ ప్రయత్నిస్తున్నాడని, ఎన్ని జాకీలు పెట్టి లేపినా అది జరగదని బొత్స సెటైర్లు వేశారు.