మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ కు మరికొద్ది గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. మునుగోడులోని పలివెల గ్రామంలో బిజెపి, టిఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రచారం సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేందర్ పై టిఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. ఇరువర్గాల కార్యకర్తలు నేతలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే, అప్పటికే శాంతించని ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే ఈటెల కాన్వయ్ లోని వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడి ఘటనలో ఈటెల పిఆర్ఓ కాలికి గాయం అయింది. ఇకచ బిజెపి శ్రేణుల దాడిలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్ కు గాయాలయ్యాయి.
పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారని, ఈ దాడికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కారణమని ఈటల ఆరోపించారు. మునుగోడులో ప్రజలు ఇచ్చే తీర్పుతో టీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనడం ఖాయమని, పలివెలలో టీఆర్ఎస్ కు క్యాడర్ కూడా లేదని, ఇక్కడ పోలీసులను కూడా లెక్క చేయకుండా వాళ్లు దాడులు చేయడాన్ని అందరూ గమనించాలని చెప్పారు. తమను ఎదుర్కోలేకే ఇలా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.
ఇక పోలింగ్ పోలింగ్ ముందు రోజు మునుగోడు ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భారీ ఊరట లభించింది. భారీ స్థాయిలో నిధులను తన కంపెనీ నుంచి ఇతరుల ఖాతాలకు పంపిణీ చేశారని కోమటిరెడ్డిపై సీఈసీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఆరోపణలలో నిజం లేదని ఆ ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు ఏమీ లేవని సీఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనితో పోలింగ్ కు ముందు రోజు రాజగోపాల్ రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.
మునుగోడు మండలం పలివెలలో బీజేపీ గుండాయిజం.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS రోడ్ షో కి వెళ్తున్న టీఆర్ఎస్ శ్రేణులపైన రాళ్ల దాడి చేసిన బీజేపీ గుండాలు.
ఎమ్మెల్సీ @PRRTRS, ఎమ్మెల్యే @PSRNSPT, జడ్పీ చైర్మన్ జగదీష్ తో సహా పలువురికి గాయాలు#MunugodeWithTRS #VoteForCar pic.twitter.com/Nj5c5vNaSi
— BRS Party (@BRSparty) November 1, 2022
ఇదీ టీఆర్ఎస్ గూండాయిజం
మునుగోడులో గెలవలేమని అర్థమై, బిజెపి ప్రచార వాహనాలపై దాడులకు తెగబడిన గులాబీ గూండాలు pic.twitter.com/CmHJYynRuF
— BJP Telangana (@BJP4Telangana) November 1, 2022