ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబు బానిస అని తరచు తిట్టడం ద్వారా ఎప్పటికీ పవన్ ని చంద్రబాబుని కలవకుండా చేద్దామని వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది.
జనసేన అభిమానులు కూడా వైసీపీ ట్రాప్ లో పడిపోయి… మేము చంద్రబాబు మనుషులం కాదు అని వైసీపీ వారికి నిరూపించడానికి అవసరం లేకున్నా ప్రయత్నం చేశారు.
పాపం వైసీపీ అంతా తాము అనుకున్నట్టే జరుగుతున్నదని, ఇక ఎప్పటికీ పవన్ ను బాబుతో కలవకుండా చేశామని సంబరపడ్డారు. నిజానికి ఓవర్ కాన్పిడెన్ష్ లో తప్పులో కాలేశారు.
పవన్ ను తొక్కేయాలని, మూడు రాజధానులకు ప్రచారం రాకుండా చేస్తున్నారన్న అక్కసుతో పవన్ కళ్యాణ్ ను కట్టడి చేశారు. ఇది పవన్ కి బాగా కోపం తెప్పించింది. జనసేన వారిని 88 మందిని దారుణమైన కేసులు పెట్టి అరెస్టు చేయడంతో పవన్ బరస్ట్ అయిపోయాడు. ఈ ఎపిసోడ్ ను వైసీపీ ఊహించలేదు.
మొన్నే వెన్నుపోటు విమర్శ పై చంద్రబాబు బాలయ్య సమక్షంలో క్లారిటీ ఇచ్చేయడమే వైసీపీకి షాక్ అంటే… ఇది ఇంకో పెద్ద షాక్. ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ భేటీపై అనేక చర్చలు జరుగుతున్నాయి. కొందరు రైట్ అంటున్నారు. కొందరు రాంగ్ అంటున్నారు. కొందరు హర్ట్ అవుతున్నారు.
ఇక జగన్ టీంలో ఒకడై ఏనాడూ జగన్ పై ఈగ వాలకుండా రాజకీయ విశ్లేషణలు జాగ్రత్తగా చేస్తున్న ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఏమన్నాడో ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో చూస్తుంటే నాగేశ్వర్ ఫ్యూజులు ఎగిరిపోయినట్టు అర్థమైపోతుంది.