టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజాల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. విజయదశమి కానుకగా నిన్న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగానే గాడ్ ఫాదర్ చిత్రం తొలి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది.
మలయాళ వెర్షన్ లోని మూల కథను తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు మోహన్ రాజా సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల వసూళ్లను రాబట్టి 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. దసరా సెలవలు, వీకెండ్ కలిసి మరో 4 రోజుల పాటు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టేందుకు మంచి అవకాశముంది. ఘోస్ట్ కు మిక్స్ డ్ టాక్ రావడం, స్వాతిముత్యం వంటి చిన్న సినిమా మాత్రమే పోటీ ఉండడంతో గాడ్ ఫాదర్ గట్టిగానే వసూలు చేసే చాన్స్ ఉంది.
ఇక, ఈ సినిమాలో మాఫియా డాన్ గా, గాడ్ ఫాదర్ గా బ్రహ్మ పాత్రలో చిరు నటన ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. చిరంజీవి రొటీన్ సినిమాల మాదిరిగా ఈ సినిమాలో పాటలు, డ్యాన్సులు లేకపోయినప్పటికీ గాడ్ ఫాదర్ పాత్రలో చిరు ఒదిగిన వైనం మిగతా పాత్రలలో సత్యదేవ్, నయనతార, సముద్రఖనిలు నటించిన తీరు గాడ్ ఫాదర్ ను ప్రేక్షకులు ఆదరించేలా చేశాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్ ఓ క్యామియో రోల్ పోషించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం సక్సెస్ అయిన క్రమంలో సల్మాన్ ఖాన్ స్వయంగా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. మై డియర్ చిరు ఐ లవ్ యూ అంటూ సల్మాన్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత బిఏ రాజు సల్మాన్ ఖాన్ వీడియో ట్వీట్ ను షేర్ చేశారు. గాడ్ ఫాదర్ సినిమా బాగా ఆడుతోందని తెలిసిందని… చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు అని సల్మాన్ చెప్పాడు. ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని ఆకాంక్షించిన సల్లూ భాయ్….వందేమాతరం అంటూ వీడియోను ముగించాడు.
Bhai @BeingSalmanKhan congratulated Megastar @KChiruTweets and the Team of #GodFather for the HUMONGOUS BLOCKBUSTER ????
Book your tickets now! ????
–https://t.co/OvaNLMDGUb#BlockbusterGodfather ????@jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev @ProducerNVP pic.twitter.com/eB7pTVn3eV— BA Raju's Team (@baraju_SuperHit) October 5, 2022