బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత కొద్ది నెలలుగా సరైన హిట్ లు లేక కుదేలవుతున్న బాలీవుడ్ ఈ సినిమాపై గంపెడాశలు పెట్టుకుంది. ఫాంటసీ, అడ్వెంచర్ జానర్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రూ. 410 కోట్ల భారీ బడ్జెట్ తో కరణ్ జొహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ నెల 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తెలుగు వర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి, దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని, వసూళ్లు రాబట్టడం కష్టమేనని ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ చిత్ర యూనిట్ ను కలవరపెడుతోంది.
ఈ సినిమాలో ఆత్మ లోపించిందని తేల్చేశాడు సంధు. ఈ సినిమాకు భారీ పబ్లిసిటీ చేశారని, దాని వల్ల సినిమా విడుదలైన తొలివారంలో వసూళ్లు రాబడుతుందని, కానీ, ఆ తర్వాత సినిమాకు కష్టాలు తప్పవని చెప్పాడు సంధు. మెరిసేదంతా బంగారం కాదని అన్నాడు సంధు.
ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలు బాలీవుడ్ లో చాలా తక్కువని, అలాంటి సమయంలో ఇలాంటి సినిమాను తెరకెక్కించినందుకు అయాన్ ముఖర్జీని ప్రశంసించాల్సిందేనని సంధు చెప్పాడు.
ఈ చిత్రంలో స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా యావరేజ్ గా ఉన్నాయని, సినిమా కొన్ని చోట్ల గజిబిజీగా అనిపిస్తుందని అన్నాడు. ఈ చిత్రంలో రణబీర్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడని, ఏం జరుగుతోందో కూడా తెలియని విధంగా రణబీర్ ఉన్నాడని షాకింగ్ కామెంట్లు చేశాడు. అలియా భట్ స్టన్నింగ్ గా ఉందని, మౌని రాయ్ పాత్ర గగుర్పాటుకు గురి చేసే విధంగా ఉందని, ఆమె పాత్ర, పర్మామెన్స్ చాలా బాగుందని కితాబిచ్చాడు. కానీ, అమితాబ్ నటన ఎప్పటిలాగానే అద్భుతంగా ఉందని, అయితే, ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉండటం ఒక డ్రాబ్యాక్ అని తెలిపాడు. 5 పాయింట్లకు గాను 2.5 పాయింట్ల రేటింగ్ ఇచ్చాడు సంధు.
Comments 1