భారీ అంచనాలతో పాటు విడుదలైన లైగర్ ఫలితం గురించి తెలిసిందే. డివైడ్ టాక్ అని సర్ది చెప్పే మాటలు ఎన్ని చెప్పినా.. సినిమా ఫలితం ఏమిటన్నది తేలిపోయింది. దీనికి తోడు లైగర్ మీద పడుతున్న సటైర్లు.. పంచ్ వీడియోలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. తమ అభిమాన హీరోను ఉద్దేశించి జరుగుతున్న నెగిటివిటీ కి రౌడీ అభిమానులు అస్సలు ఊరుకోవటం లేదు. తమ హీరోను తప్పు పడుతున్న వారిపై పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. పోస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కొందరిని అయితే ట్రోల్ చేసేందుకు వెనుకాడటం లేదు.
ఇలాంటివేళ.. బాలీవుడ్ స్వయం ప్రకటిత అనలిస్టు కమ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్ కే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడున్న రచ్చ సరిపోదన్నట్లుగా.. లైగర్ పై తనకున్న నోటి దురద తీర్చేసుకున్నారు. పూరీ తాజా మూవీ మొత్తం కాపీ కంటెంట్ గా భారీ ఆరోపణ చేశాడు. ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా.. పలు సీన్లు గతంలో విడుదలైన ఏ సినిమాలోనివో సైతం చెప్పేస్తున్నారు.
శాంపిల్ గా చూస్తే.. సినిమా మొదట్లో విజయ్.. రమ్యకృష్ణ టీ షాపును ముంబయిలో నడపటం.. రౌడీ వచ్చి గొడవ చేస్తే.. హీరో ఫైట్ చేస్తాడు. ఈ సీన్ అప్పట్లో వచ్చిన దేశద్రోహి మూవీ కి కాపీగా చెప్పారు. అంతేకాదు.. బాక్సింగ్ నేపథ్యంలో తీసిన సీన్లు సైతం తూఫాన్ అనే మూవీలో ఉన్న వాటినే దర్శకుడు పూరీ దించేసినట్లుగా ఆరోపించాడు. సినిమా మొత్తంలో దాదాపు 64 సీన్లు యాక్షన్ తో ఉంటే.. అవేమీ సినిమాకు ఉపయోగపడలేదన్నాడు.
రమ్యకృష్ణ పాత్ర.. అనన్య పాండే ప్రభావం ఏమాత్రం లేదని తేల్చిన ఆమె.. క్లైమాక్స్ లో మైక్ టైసన్ ఫైట్ చెత్తగా ఉందని తేల్చారు. కరణ్ జోహార్ క్లైమాక్స్ ఏదన్న అతడు.. పూరీ రూ.160 కోట్లు తీసుకొని ప్లాప్ స్టోరీ.. స్ట్రీన్ ప్లే.. డైలాగ్స్ ఇచ్చాడంటూ మండిపడ్డాడు. ఎవరినైనా అసిస్టెంట్ ను పెట్టుకొని ఇంకాస్త జాగ్రత్తగా డైలాగ్స్.. కథ రాసుకోవచ్చు కదా? అని ప్రశ్నించాడు. విజయ్ గురించి తనకు తెలీదని.. లైగర్ లో హీరోకు నత్తి పెట్టటంతో అతగాడి యాక్టింగ్ జీరో అని తేల్చేసిన కేఆర్ కే.. చివర్లో మరింత షాకింగ్ కామెంట్ చేశాడు. డబ్బులు ఎక్కువైతే ఈ సినిమా చూడొచ్చంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి.
wqBSKmVQoz