అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల….కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ….ఈ మాటలకు బాగా ఇన్స్ పైర్ అయిన వైసీపీ నేతలు….చెట్టు, పుట్ట, కరెంటు స్తంభం, బోరింగు, ప్రభుత్వ కార్యాలయాలు, చెత్త సేకరించే బండ్లు…ఆఖరుకు జాతీయ జెండా…కాదేదీ వైసీపీ రంగులకనర్హం అని జగనన్న జమానాలో వైసీపీ నేతలు నయా కవులుగా మారడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ రంగుల పిచ్చి ఏంటని కోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నా…వైసీపీ నేతల తీరుమాత్రం మారడం లేదు.
చివరకు గత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి రంగు రంగుల విద్యుత్ బల్బుల దండలకు బదులుగా…తమ పార్టీ జెండా రంగులు వేసి చివాట్లు తిన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందించే చిక్కీల ప్యాకెట్లపై జగన్ బొమ్మతోపాటు..ప్యాకెట్ కవర్ ను పార్టీ జెండాను పోలిన రంగుతో పులిమేసి తమ పైత్యాన్ని మరోసారి చాటుకున్నారు.
ఇక, భారతీయులకు జాతీయ జెండా మాదిరిగా తమకు వైసీపీ జెండా అని ఫీలవుతున్న వైసీపీ నేతల రంగుల పిచ్చ తాజాగా పీక్స్ కు చేరింది. దేశమంతా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో భవనాలను విద్యుత్ కాంతుల నడుమ రంగరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, వైసీపీ నేతలు మాత్రం బులుగు రంగు పులిమి తమకు జాతీయ జెండా కన్నా పార్టీ జెండానే ముఖ్యమని చాటుకున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశమంతా భారీ జాతీయ జెండాలతో ర్యాలీలు చేస్తూ వేడుకలు జరుపుకుంటోంది. కానీ, వైసీపీ నేతలు మాత్రం దేశ ఆత్మగౌరవ సూచికైన మువ్వన్నెల జాతీయ పతాకానికి కూడా తమ పార్టీ జెండా రంగు బులుగును జోడించడంపై ట్రోలింగ్ జరుగుతోంది. జాతీయ జెండాకు నేరగాళ్ల పార్టీ చేసిన అగౌరవం సిగ్గు..సిగ్గు..అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దేశమంతా జాతీయ పతాకం మువ్వన్నెల కాంతులు… ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైసీపీ బులుగు జెండా వెలుగులు…అంటూ విమర్శిస్తున్నారు. దీంతో, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.