తెలంగాణలో బీజేపీ తన పనిని షురూ చేసి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ దిశగా అడుగులు వేస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ జోరును మరింత పెంచాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా తమ అధిక్యతను ప్రదర్శించేలా పావులు కదుపుతోంది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయటంతో పాటు.. పార్టీలో చేరే సమయానికి ముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం ద్వారా ఉపఎన్నికను అనివార్యమయ్యేలా చేశారు.
రాజగోపాల్ రెడ్డి కారణంగా తెలంగాణలో బీజేపీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాజగోపాల్ రెడ్డి కారణంగా తెలంగాణలో బీజేపీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రానున్న నెలల్లో మరిన్ని యాక్టివిటీస్ జరిగేలా చూసుకోవటం.. పార్టీ ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు.
ఇందులో భాగంగా మరికొందరు నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజాగా సహజ నటి కమ్ సీనియర్ నటిగా పేరున్న జయసుధ పేరు తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు వీలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె కీలకంగా వ్యవహరించటం..2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆమెకు ఆ ప్రాంతంలో మంచి పేరు.. పట్టు ఉంది.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె కీలకంగా వ్యవహరించటం..2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆమెకు ఆ ప్రాంతంలో మంచి పేరు.. పట్టు ఉంది.
వైఎస్ మరణం తర్వాత ఆమె కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికీ.. తర్వాతి కాలంలో టీడీపీలో చేరారు.
ఆ తర్వాత తనకు రాజకీయ అవకాశాల్ని కల్పించిన వైఎస్ రుణాన్ని తీర్చుకోవటానికి ఆమె వైఎస్ తనయుడు జగన్ స్థాపించిన పార్టీలో చేరారు. కొంతకాలం క్రియాశీలకంగా ఉన్నా.. తర్వాతి నుంచి ఆమె మౌనంగా ఉంటున్నారు.
మళ్లీ ఇప్పుడు బీజేపీ పుణ్యమా అని జయసుధ పేరు తెర మీదకు వచ్చిందని చెప్పాలి.
ప్రస్తుతం ఆమెను పార్టీలోకి చేర్చుకోవటానికి వీలుగా చేరికల కమిటీ స్పందించింది. ఆమెను తమ పార్టీలో చేరాలని ఆహ్వానించింది.
ప్రస్తుతం ఆమెను పార్టీలోకి చేర్చుకోవటానికి వీలుగా చేరికల కమిటీ స్పందించింది. ఆమెను తమ పార్టీలో చేరాలని ఆహ్వానించింది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రముఖ సినీ నటీనటుల్ని చేర్చుకుంటున్న బీజేపీ.. తెలంగాణలో జయసుధను సంప్రదించినట్లుగా చెబుతున్నారు.
సినీ గ్లామర్ తమ పార్టీకి కలిసి వస్తోందని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
మరి.. బీజేపీ ఆహ్వానానికి జయసుధ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.