గత ఏడాది నుంచి వరుస పెట్టి సెలబ్రిటీలు.. సినీ తారలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకోవటం ఎక్కువైంది. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరారు పంజాబీ ముద్దుగుమ్మ.. సినీ నటి మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. తాజాగా పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనమడితో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలోనే అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగనున్నాయి. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరంటే..
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కొడుకు.. ఆడంపూర్ ఎమ్మెల్యే కులదీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్ తో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ పంజాబీ ముద్దుగుమ్మ హర్యానా కుర్రాడితో ప్రేమలో పడగా.. తాజాగా వారి ఎంగేజ్ మెంట్ జైపూర్లోని అలీలా కోటలో ఘనంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోల్ని మెహ్రీన్ ఇన్ స్టాలో షేర్ చేసింది.
ఎంగేజ్ మెంట్ లో భాగంగా సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన మెహ్రీన్.. అనంతరం ఇరువురు రింగులు మార్చుకున్నారు. మూడు దఫాలుగా హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన భజన్ లాల్ మనమడు భవ్యతో ఆమె ప్రేమలో పడ్డారు. హర్యానా రాష్ట్రంలో రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబంగా పేరుంది. వీరి పెళ్లి వేడుకకు రాజస్థాన్ లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ వేదిక కానుంది. మరి.. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎఫ్3లో నటిస్తోంది.