అవసరమైతే విశాఖకు వెళ్లి మా మద్దతు ఇస్తాం మంత్రి KTR…!!
చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలను కుడా ప్రైవేట్ పరం చేసేలా ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు.
ఇకఈవ్యాఖ్యలవెనుకున్న రెండోకోణం చూద్దాం..
KTR ఏమీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమతో
విశాఖ ఉక్కుకి మద్దత్తు ప్రకటించడం లేదు!
మోడీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రై “వేటు” పరం చేస్తాను అన్న
మాట మనం మర్చిపోయి ఉండొచ్చు కానీ
KTR , KCR లకి నిద్రపోనీకుండా చేస్తుంది.
హైద్రాబాద్ చుట్టుపక్కల ఎన్ని CPSU లు
ఉన్నాయో లెక్క పెట్టుకోండి!
హైదరాబాద్ కి
హైటెక్ సిటీ రాక ముందు వాటి చుట్టూనే ఆర్ధిక వ్యవస్థ ఆధారపడి ఉండేది! ఈ తరానికి తెలీకపోవచ్చు కానీ మన ముందు తరం పెద్దల్ని అడిగి చూడండి list చెప్తారు.
వాటితో వాళ్ళ అనుబంధం , తీపి గురుతులు
కథలు కథలుగా..
ECIL, BDL, BEL, BHEL , NMDC ,…
ఇవి కాక రామగుండం NTPC , FCI లాంటి భాగస్వామ్య సంస్థలు ఇంకా ఎన్నో ..
మోడీ వీటిలో ఏ ఒక్క దానిని ప్రైవేటీకరించినా అది TRS ప్రభుత్వం పీకకు చుట్టుకుంటుంది, అందుకే ముందే మేల్కొన్నారు తండ్రీ కొడుకులు!
ప్రాప్తకాలజ్ఞత
అందుకే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది!
నిన్నటివరకు ద్వేషం కక్కిన ఆంధ్రుల మీద ప్రేమ పొంగుకొస్తుంది..
సోదర భావం కొమ్ము కాస్తుంది!
అందరూ మేల్కొంటున్నారు..
ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు..