మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో ఆయన విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తనను సత్కరించేందుకు వచ్చిన చిరంజీవితో మాట్లాడుతున్న మోదీ ఉద్వేగానికి లోనయ్యారు.
చిరు భుజం తట్టి మరీ ప్రోత్సహిస్తున్నట్లుగా మాట్లాడిన మోదీ, ఓ నిమిషం పాటు చిరుతో చిట్ చాట్ చేశారు. మోదీ మాటలను విన్న చిరు భావోద్వేగంతో మోదీకి నమస్కరించారు. ఇక, చిరుతో మాట్లాడుతున్నంత సేపు మోదీ ఆయన చేతులను విడిచిపెట్టలేదు. దీంతో, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టాలీవుడ్ లో లెజెండరీ నటుడిగానే కాకుండా, మాజీ కేంద్ర మంత్రిగా, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ల ద్వారా సామాజిక సేవ చేస్తున్న వ్యక్తిగా చిరును మోదీ అభినందించారని అంటున్నారు.
ఇక, ఈ కార్యక్రమానికి వచ్చిన మోదీ..చిరుతో స్నేహం కోసం తపిస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. భవిష్యత్తులో చిరును బీజేపీలోకి మోదీ ఆహ్వానించే అవకాశముందని కామెంట్లు పెడుతున్నారు. ఇక, జగన్ తో మంచి దోస్తీ ఉన్న చిరుతో దోస్తీకి మోదీ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆల్రెడీ చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ తనతోనే బీజేపీ, టీడీపీలు కలిసి రావాలని అని స్టేట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో కాపు ఓట్ బ్యాంకు కొల్లగొట్టేందుకే మోదీ ప్లాన్ వేశారని అంటున్నారు.