వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను ఇబ్బంది పెట్టాలని జగన్ సర్కార్ చూస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే, నర్సాపురంలో మోడీ పర్యటన సందర్భంగా తన సొంత నియోజకవర్గానికి రావాలనుకుంటున్న రఘురామను అడ్డుకోవాలని నానా రకాలుగా ప్రయత్నిస్తోంది. రఘురామ ఏపీలో అడుగుపెట్టిన వెంటనే ఏదో ఒక కేసు పెట్టి అరెస్ట్ చేయాలన్న ప్లాన్లో జగన్ సర్కార్ ఉందని రఘురామ ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే రఘురామ కోర్టును ఆశ్రయించగా…కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టులో జగన్ సర్కార్ కు గర్వ భంగం కావడంతో జగన్ సర్కార్…రఘురామను ఇబ్బంది పెట్టేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేసింది. దీంతో, జగన్ ప్రభుత్వంపై, అధికారులపై ఆర్ఆర్ఆర్ విమర్శలు గుప్పించారు.
భీమవరంలోని తన ఇంటికి వెళ్లే దారిని శుక్రవారం రాత్రి స్థానిక అధికారులు తవ్వేశారని రఘురామ ఆరోపించారు. తాను నడుచుకుంటూ వెళ్లేందుకే ఇలా చేశారని ఆరోపించారు. బహుశా కేసు నమోదు చేసి తనను అరెస్టు చేసేందుకు అధికారులు పోలీసులతో కలిసి కుట్ర చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం క్రిమినల్ ఆలోచనలు నెవర్ బిఫోర్,ఎవర్ ఆఫ్టర్ అని సెటైర్లు వేశారు.