వైసీపీ పాలనలో ఇదో చిత్రం. వద్దు వద్దు అంటున్నా..నిర్మాణాలు శరవేగంగా సాగిపోతున్న రుషికొండపై నిర్మాణం కోసం.. ఇప్పుడు ఓ వ్యక్తి(అధికార పార్టీ అనుచరుడని విశాఖ గగ్గోలు పెడుతోంది) దరఖాస్తు చేసుకున్నాడు.
అంతేనా.. అడిగినంత డబ్బులు కట్టేస్తాను.. నాకుఅనుమతి ఇచ్చేయండి.. అని అధికారులపై ఒత్తిడి కూడా తెస్తున్నాడు.
మరి ఆ చిత్రం ఏంటో.. అసలు విషయం ఏంటో.. మీరూ చదివి తరించండి!!
రుషికొండపై వివాదాస్పద నిర్మాణానికి సంబంధించి ఈనెల 13న అరవింద్ ముద్రగడ అనే వ్యక్తి పర్యాటక శాఖ తరఫున ఆన్లైన్లో ప్లాను కోసం దరఖాస్తు చేశారు.
ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తును పరిశీలించి, ఇంకా సమర్పించాల్సిన పత్రాలు, ఆస్తిపన్ను బకాయిలు తదితర (షార్ట్ ఫాల్స్) వివరాలను తిరిగి జీవీఎంసీ కోరింది.
దీంతో ఇంకేమంది.. సదరు పత్రాలు సమర్పించేందుకు.. ఆ అరవింద్ అనే వ్యక్తి .. ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
విశాఖ నగరంలోని రుషికొండపై వివాదాస్పద నిర్మాణంపై హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా సీరియస్ అయ్యాయి.. చెట్టు పోయినా పెంచుకోవచ్చు కానీ.. కొండలు తొలిచేస్తుంటే.. పెంచడం సాధ్యమా.. అని న్యాయ\మూర్తులు నిలదీశారు.
అయినప్పటికీ.. కొందరు ఇక్కడ నిర్మాణాలను మాత్రం సాగించేస్తున్నారు.
బహుశ వీరిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో.. ఈనెల 13న అరవింద్ ముద్రగడ అనే వ్యక్తి పర్యాటకశాఖ తరఫున ఆన్లైన్లో ప్లాను కోసం దరఖాస్తు చేశారు.
దీని కోసం జీవీఎంసీకి రూ.19.05 కోట్ల నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తును పరిశీలించి, ఇంకా సమర్పించాల్సిన పత్రాలు, ఆస్తిపన్ను బకాయిలు తదితర (షార్ట్ ఫాల్స్) వివరాలను తిరిగి జీవీఎంసీ కోరింది.
ప్రస్తుత నిర్మాణానికి సంబంధించిన పత్రాలను పర్యాటకశాఖ సమర్పిస్తే జీవీఎంసీ పూర్తి స్థాయిలో అనుమతులు మంజూరు చేస్తుంది.
ఇప్పటికే రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
మరో పక్క ఇక్కడ నిర్విరామంగా పనులు కొనసాగుతున్నాయి.
సాధారణంగా ఆన్లైన్లో ప్లాన్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే బిల్డింగ్ అప్లికేషన్ నంబరు వస్తుంది. ప్లాన్ రాకపోయినా అప్లికేషన్ నంబరు ఆధారంగా పనులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.