ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ మరణాలను పట్టించుకోవడం లేదు అన్న విమర్శ వస్తోంది.
చనిపోయిన వారి సంఖ్య తగ్గించి, పరిహారాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా అని విపక్షం నుంచి ప్రశ్న ఒకటి వినవస్తోంది.
నాలుగు కాదు నలభై వేల మందికి పైగా కోవిడ్ కారణంగా చనిపోయారు. కానీ వాటి సంఖ్యను దాచి మాట్లాడుతున్న ప్రభుత్వ నైజం ఒకటి వెలుగులోకి వచ్చింది.
దీంతో ఈ వివరాలు తెలిసి చాలా మంది అంతర్మథనం చెందుతున్నారు. రెండేళ్ల కాల గతికి సంబంధించి 3 ప్యాండమిక్స్ ను చూశాం.
కానీ ఎప్పటికప్పుడు బాధితుల సంఖ్యను వెల్లడించిన ప్రభుత్వం మరణాల సంఖ్యను మాత్రం చాలా తక్కువ చేసి చూపించింది అని అప్పట్లో కూడా కొన్ని వార్తలు నిజాలు ప్రభుత్వాస్పత్రుల నివేదికల ఆధారంగా వెల్లడయ్యాయి .
ముఖ్యంగా కోవిడ్ కారణంగా మరణించిన వారికి సంబంధించి ఉన్న కుటుబాలకు ఇప్పటికే ఏ పాటి కూడా సాయం చేయలేదని సుప్రీం కోర్టు కూడా
ఏపీ ప్రభుత్వానికి మొట్టికి కాయలు వేసింది. అయినా కూడా ప్రభుత్వంలో మార్పు రాలేదన్న విమర్శ ఉంది.
దేశ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా ఏడు లక్ష ల 91 353 మంది మరణించారు.
కానీ ఇంతటి స్థాయిలో మరణాల తీవ్రత ఉన్నా వారి సంబంధీకులకు, మరియు వారి బిడ్డలకు ఆదుకునేందుకు అటు కేంద్రం కూడా చొరవ చూపిన దాఖలాలే లేవు.
ఆఖరికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేసి కొందరు అనాథలను ఆదుకున్నాయి.
ఏపీలో అయితే ఇప్పటికీ కారుణ్య నియామకాలు జరగని శాఖలు ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే వీటి భర్తీకి కూడా లంచాలు తీసుకున్న వైసీపీ ప్రముఖులు,అధికార ప్రబుద్ధులు ఉన్నారన్న వార్తలు కొన్ని వెలుగు చూశాయి.
అయినప్పటికీ కూడా కొందరే బాధితులు కాస్తో కూస్తో కోలుకున్నారు.
మరణ వార్తలను తట్టుకుని మిగిలిన ప్రాణాలను నిలబెట్టుకున్నారు.
కానీ ప్రభుత్వం తరఫున వీరికి అందిన సాయం ఏమీ లేదు.
కోవిడ్ కారణంగా మరణించిన వారికి పరిహారాలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ అందలేదు.
చాలా చోట్ల ఇప్పటికీ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న బాధితులు ఉన్నారు.
ఈ దశలో మరణాల సంఖ్యను తక్కువ చూపించి, పరిహారాలను చెల్లించకుండా ఏపీ సర్కారు తప్పుకుందా అన్న ప్రశ్న ఒకటి విపక్షం నుంచి వస్తుంది.