రాజకీయాల్లో ఎన్ని దెబ్బలు తిన్నా.. నాయకులు అంతిమంగా చెప్పేది ఈ మాటే. తమకు ఎంత నొప్పి ఉన్నా.. సహజంగానే భరిస్తూ.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం! అనేస్తారు.
ఇప్పుడు.. వైసీపీ కూడా ఇదే మాట అనాల్సి వస్తుందేమో.. అని పరిశీలకులు.. చెబుతున్నారు.
దీనికి కారణం.. తాజాగా వరద ప్రభావిత జిల్లాల్లో… టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ పర్యటనను అంత తేలికగా తీసుకునేది కాదు.
భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు.. ఇలా ఎంతో మంది చంద్రబాబు కు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా.. కాన్వాయ్‌కు సైతం అడ్డుతగిలారు. ప్రతి చోటా.. బాబుకు నీరాజనాలు పట్టారు. జయహో చంద్రన్న నినాదాలతో.. జనం జోరు పెంచారు. చంద్రబాబు పర్యటనలో జోష్ పెంచారు. ఈ పరిణామాలను గమనించిన వారు.. ఇటీవల జరుగుతున్న పర్యటనలను కూడా గుర్తు చేస్తున్నారు.
బాబు చేస్తున్న అన్ని పర్యటనలు కూడా.. ఇలానే సక్సెస్ అవుతున్నాయి. మహానాడుకు ముందు.. తర్వా త.. అనదగ్గరీతిలో చంద్రబాబు దూకుడు పెంచారు. దీనికి ప్రజల నుంచి పార్టీ నాయకుల నుంచి వస్తు న్న స్పందన.. అనూహ్యంగా ఉంది. ఇదే ఊపు కొనసాగితే.. రాష్ట్రంలోని కనీసం.. 18 జిల్లాల్లో (కొత్తవి) పార్టీ జోష్ పెరిగితే.. ఇక,టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే.. 12 నుంచి 15 (కొత్తవి) జిల్లాల్లో పార్టీ మంచి ఊపు మీద ఉంది.
ఇక, మరో నాలుగైదు.. జిల్లాల్లో కనుక ఊపు పెంచుకోగలిగితే.. ఖచ్చితంగా.. పార్టీ గెలిచి తీరుతుందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం అమలు చేస్తున్నామన్న జగన్.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం! అని చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని.. వారు చెబుతున్నారు. మరి దీనికి కర్త , కర్త.. క్రియ అంతా.. టీడీపీ సైన్యమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుకదా!!