చరిత్రలో అబద్ధం గెలిచిన సందర్భాలు తక్కువేం కాదు
కానీ ఒక అబద్ధం గెలిచాక … జనానికి నిజం విలువు తెలిసినపుడు ఓడిపోయిన నిజమే నిప్పుకణికలా జగజ్జేయమానంగా మండటం కూడా చూశాం.
అలాంటి సందర్భాన్ని ఈ వర్తమానం మరో చరిత్ర కోసం సృష్టస్తోంది.
దానిని కళ్లారా చూపే చిత్రమిది
పెద్దలు వెయ్యి అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయమన్నారు. ఆ సామెతను తనకు అనుకూలంగా ఆలోచించుకున్న వైసీపీ అధినేత జగన్ లక్ష అబద్ధాలు అయినా ఆడాలి కానీ అధికారంలోకి రావాలి అని… ప్రభుత్వం మీద పదేపదే అబద్ధపు ప్రచారాలు చేయించి విజయం సాధించారు.
వారికి నేడు ప్రజాదరణ కొరవడినందువల్లే ప్రజల్ని మెప్పించి గెలవలేకపోతున్నారని, తెలుగుదేశం అభ్యర్థులు పోటీకి నిలబడితే భయపెట్టి, బెదిరించి విత్ డ్రా చేయిస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తుంది. జగన్ కు తన పాలన మీద నమ్మకం ఉంటే, తన పథకాల మీద విశ్వాసం ఉంటే ప్రతి వార్డులో తెలుగుదేశం అభ్యర్థులను బహిరంగంగా పోటీకి నిలవమని పిలుపునివ్వాలి. ప్రజల ఓట్లో గెలిచిచూపాలి అంటున్నారు.
అది సాధ్యం కాకనే దౌర్జన్యాలు, బెదిరింపులు, కిడ్నాపులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల్లో చంద్రబాబుకు వస్తున్న స్పందన చూస్తుంటే… జగన్ పార్టీ నేతలకే కాదు, జగన్ కే ఏడుపాగదేమో!