జనసేన పార్టీ మహిళా విభాగం నాయకులు.. వీర మహిళలు విశ్వరూపం చూపించారు. తాజాగా.. సీఎం పర్యటనలో వారు సర్కారు తీరును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై వీర మహిళలు విశ్వరూపం ప్రదర్శించారు. వరదలు వచ్చి.. ఇన్ని రోజులు అయ్యాక బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఏం చేస్తారని.. వారు నిలదీశారు. అంతేకాదు.. ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం రూ.2 వేల చొప్పున ముష్ఠి వేశారంటూ.. దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల నిరసనకారులను అరెస్టు చేస్తున్నారు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో నిరసన తెలపాలని జనసేన పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చిం ది. దీంతో జనసేన పార్టీ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా వరద బాధితులకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది.
ముఖ్యమంత్రికి పార్టీ తరుపున వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే నిరసనకు దిగుతా మని పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటిస్తున్న ప్రాంతానికి చేరుకున్న ఉభయ గోదావరి జిల్లాల వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న జక్కంపూడి రాజా కాన్వాయ్‌ను మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు, మహిళలకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
ఈ సమయంలో రాజా.. వీర మహిళలను ఉద్దేశించి.. బూతులు తిట్టారు. మీడియాలో వినలేని.. రాయలేని పదాలు వినియోగించారని వీర మహిళలుఆరోపించారు. ఇదే విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. రాజా కాన్వాయ్‌కు అడ్డుపడిన వీర మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. కానీ, వీర మహిళలను అరెస్టు చేశారన్న సమాచారంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి బారీ సంఖ్యలో జనసేన నేతలు.. గోదావరి జిల్లాలకు తరలివెళ్లారు.
Comments 1