‘తానా’ ద్వారా నా వంతుగా కమ్యూనిటీకి సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో ‘రాజా కసుకుర్తి’ అనే నేను ‘కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్’ పదవికి పోటీ చేస్తున్నాను. ‘తానా’ సభ్యులు నా లక్ష్యాలను గమనించి నన్ను గెలిపించాలని కోరుతున్నాను.
ఉత్తర అమెరికా అంతటా సిపిఆర్ ట్రైనింగ్ కార్యక్రమం….ఎంతోమందిని హార్ట్ అటాక్ స్ట్రోక్ నుంచి రక్షించే అవకాశం కల్పించడం
బోన్ మారో డ్రైవ్…అటిజంపై అవగాహన, బ్లడ్ డ్రైవ్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం
‘తానా’ బ్యాక్‌ప్యాక్ పంపిణీ కార్యక్రమంలో యూత్‌ను పాల్గొనేలా చేయడం…
వివిధ వ్యాపార సంస్థలతో మాట్లాడి ‘తానా’ సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్ సదుపాయం కల్పించడం
ఉత్తర అమెరికాలోని మన చిన్నారులకు ఆన్లైన్ ద్వారా, నేరుగా సమ్మర్ క్యాంప్‌ల ఏర్పాటు
ఫీడ్ ద నీడీ కార్యక్రమం కింద పేదలకు అహారము, అనాథ పిల్లలకు డ్రస్సులు, బొమ్మల పంపిణీ
ఉత్తర అమెరికాలో ఉంటున్న తెలుగు విద్యార్థులకు మార్గదర్శకాలను తెలియజేయడం, సహాయపడటం
ఉత్తర అమెరికాలో చదువుకుంటున్న మన పిల్లలకు ‘తానా ‘స్కాలర్షిప్లను ఇవ్వడం
అమెరికాకు వచ్చిన తల్లితండ్రులకు, విధ్యార్ధులకు ప్రత్యేక వైద్య సదుపాయాల కల్పన
వివిధ విషయాలపై సదస్సులు, నిష్ణాతులతో ప్రసంగాలు
చిన్నారులు, పెద్దలకోసం యోగ, మెడిటేషన్ కార్యక్రమాలు
ఉత్తర అమెరికాలో ఉన్న మనవాళ్ళ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు సేవలు
‘తానా’ సభ్యులు నా సేవలను, లక్ష్యాలను గమనించి నన్ను మరియు మా టీంనూ గెలిపించాలని మరోసారి కోరుతున్నాను.
సదా కమ్యూనిటీ సేవలొ
మీ రాజా కసుకుర్తి