తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో.. భారీగా నష్టపోతున్న ఏపీకి అంతో ఇంతో సాయంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఐదేళ్ల వరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న వరాన్ని ఇచ్చారు. అయితే.. అప్పటి పరిస్థితుల కారణంగా దాన్ని చట్టంలో చేర్చలేదు. ఇది కేవలం సాంకేతికంగా దొర్లిన తప్పిదమే తప్పించి.. మరింకే ఉద్దేశం కాదు.
కానీ.. అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ససేమిరా అనటం.. దానిపై ఒత్తిడి తెచ్చినా పట్టించుకోకపోవటం ఒక ఎత్తు అయితే.. తాము ఇవ్వాల్సిన హోదాను ఇవ్వకున్నా.. తమకు సలాం చేసే ఏపీ ప్రజల మీద మోడీ అండ్ కోకు చులకన ఉండటం తప్పేం కాదు. ఈ కారణంతోనే.. హోదా లేదు గీదా లేదని తేల్చేసినా.. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం తప్పించి ఏపీ ప్రజలు చేస్తున్నది ఏమీ లేదు. చెప్పిందే చెబుతున్న వేళలో.. ‘పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా’ అంటూ విసుక్కోవటం మానేసి.. ఏమీ పట్టనట్లుగా నిర్లప్తంగా ఉండిపోవటం ఆంధ్రోళ్లకే సాధ్యమవుతుంది.
ఎప్పటిలానే మోడీ సర్కారు ఏ మాత్రం జంకు లేకుండా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయాన్ని సింఫుల్ గా తేల్చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని తేల్చేసింది. సాధారణ రాష్ట్రాలు.. ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య ఎలాంటి తేడాను పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ చూపించలేదని స్పస్టం చేసింది. తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని ఒక ప్రశ్న సంధించారు.
దీనికి సమాధానం ఇచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రియాక్టు అవుతూ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అనేక అంశాల్ని ఇప్పటికే అమలు చేశాం. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు.. సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. పన్నుల్లో వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాం.
15వ ఆర్థిక సంఘానికి కూడా అదే తరహా సిఫార్సులు చేశాం. విభజన చట్టంలోని సంస్థ ఏర్పాటు అనేది సుదీర్ఘమైన ప్రక్రియ’’ అంటూ కేంద్రం ఇచ్చిన సమాధానం చూస్తే ఒళ్లు మండక మానదు. తెలుగు రాష్ట్రాలపై మోడీ సర్కారు అనుసరిస్తున్న వివక్షకు నిలువెత్తు రూపంగా ఏపీ ఉదంతాన్ని చెప్పక తప్పదు. అయినప్పటికీ ఆంధ్రోళ్లలో ఉలుకు పలుకు లేకుండా ఉండటమే వారికి మాత్రమే చెల్లుతుందేమో?

Comments 1