ఏపీలో వైసీపీ పాలన అంతం కావాలని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహిం చిన జనవాణి కార్యక్రమంలో పలువురు నుంచి ఆయన దరఖాస్తులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కొన్ని సంత్సరాలు రోడ్లపై తిరిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తాడని అందరూ భావించారని అన్నారు. కానీ, అది భ్రమేనని తేలిపోయిందని, అధికారంలోకి రాగానే 30లక్షల మంది భవన కార్మికుల పొట్టకొట్టారని విమర్శించారు. వందలాది మంది కార్మికులు చనిపోయారని అన్నారు. ఆరోజు నుంచే జనసేన పోరాటం ప్రారంభమైందని పవన్ చెప్పారు.
“ఇది మూడో ఆదివారం జనవాణి కార్యక్రమం చేపట్టి. అవినీతి, ఇళ్ల పట్టాలు, మౌలిక వసతులు గురించి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. గత ప్రభుత్వం తప్పుచేసింది.. ఇసుక విధానాన్ని మరింత సరళతరం చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పింది.. కానీ, ఇసుక దోపిడీ పెరిగిపోయిందని ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. లారీ ఇసుక రూ.28వేల నుంచి 36వేల వరకు ధర పలుకుతోంది. ఎస్సీలకు వైసీపీ అండగా ఉంటుందనుకున్నారు.. కానీ, ప్రశ్నిస్తే వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు“ అని దుయ్యబట్టారు.
గోపాలపురంలో 25మంది ఎస్సీ యువకులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారని తెలిపారు. డ్వాక్రామహిళలకు జరుగుతున్న అన్యాయాలు. టిడ్కో ఇళ్ల సమస్యలు, భీమవరంలో డంపింగ్ యార్డు తదితర సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయని పవన్ తెలిపారు.
వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపానం నిషేధం చేపడతామని చెప్పారని, కానీ, మద్యం ద్వారా రూ.25వేల కోట్లు ఆదాయం పొందుతున్నారని విమర్శించారు.
“ఇవాళ ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్ముతోంది. మద్యం అమ్మకాల్లో డిజిటల్ ట్రాన్సక్షన్స్ లేవు. కేవలం నగదు ద్వారానే అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం తాగి అనధికార గణాంకాల ప్రకారం.. దాదాపు 5 వేల మంది చనిపోయారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేవలం 36 ఉద్యోగాలే భర్తీ చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో డయాలసిస్ బాధితులకు వైద్యం అందట్లేదు. నూతన ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో రాష్ట్రంలో విద్యావ్యవస్థను దెబ్బతీసింది. ప్రజల్లో మార్పు రావాలి. వైసీపీ పాలన అంతమవ్వాలి“ అని పవన్ నినదించారు.
Excellent Response From 3rd Phase JANAVANI program.,Bhimavaram????#Janasena pic.twitter.com/3WsE8SgaBi
— గోదారోడు???? (@bonamsaibaba) July 17, 2022
Comments 1