టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ఓ సంచలన రహస్యం వెల్లడించారు. టీడీపీ నుంచి కొందరు నాయకులు హఠాత్తుగా పార్టీ మారిపోతున్నారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంపై తాజాగా ట్వాట్టర్ లో స్పందించిన టీడీపీ వారికి వైసీపీ నేతలు, ముఖ్యంగా సీఎం జగన్ కండువాలు ఎందుకు కప్పుతున్నారో.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు లోకేష్. మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు లేనందునే.. టీడీపీ నేతలకు కండువా కప్పుతున్నారని దుయ్యబట్టారు.
తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ కౌన్సిరల్ అభ్యర్థిని.. వైసీపీలో చేరారు. దీంతో సోషల్ మీడియాలో టీడీపీపైనా అదేసమయంలో వైసీపీపైనా ఆసక్తికర కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ స్పందించారు. వైసీపీకి అభ్యర్థులు లేకపోవడం వల్లే.. అలాచేస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు .. వైసీపీ నాయకులు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటేనే భయపడుతున్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజల పీకలపై కత్తి పెట్టి ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు.. టీడీపీ నుంచి మునిసిపాలిటీల్లో గెలిచే అభ్యర్థులను ముందుగానే పసి గట్టి కండువాలు కప్పుతున్నారని అన్నారు.
“నువ్వొక నాయకుడివి.. నీదొక పార్టీ“ అని జగన్పై లోకేష్ నిప్పులు చెరిగారు. తాజాగా జరుగుతున్న పరిణా మాలకు టీడీపీ నాయకులు ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదని. ఇవన్నీ తనకు తెలుసునని.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరిన్ని.. ఒత్తిడులు జరిగే అవకాశం ఉందన్న లోకేష్.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. గత శైలి కి భిన్నంగా మరోసారి లోకేష్.. జగన్పై నిప్పులు చెరగడం.. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి లైకులు అందుకుంటుండడం గమనార్హం.