కొద్ది రోజుల క్రితం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరుతున్నా అని చెప్పిన జగన్…లండన్ లో ల్యాండ్ కావడంపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. దావోస్ కు వెళ్లడం ఎందుకు దండగ అంటూ విమర్శించిన…జగన్ రెడ్డి ఖరీదైన ప్రైవేట్ విమానం అంతకంటే ఖరీదైన ఎయిర్ పోర్టులో జగన్ ల్యాండ్ కావడం వివాదాస్పదమైంది. దాదాపుగా కోటిన్నర కేవలం ఫ్లైట్ ఖర్చు అని, లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్, కేవలం ప్రైవేట్ ఎయిర్ పోర్ట్. ధనవంతులు మాత్రమే దిగే చోటు అని టీడీపీ నేతలు విమర్శించారు.
ఇక జగన్ రెడ్డి, సీబీఐ కోర్ట్ లో, తాను దావోస్ వెళ్తున్నా అని చెప్పి, లండన్ వరకు ఎందుకు వెళ్లారోనని వారు నిలదీశారు. దండుకున్న అవినీతి సంపద దాచుకోడానికే లండన్ లో జగన్ ల్యాండ్ అయ్యారని టాక్ వచ్చింది. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే జగన్ తాజాగా దావోస్ టూర్ కి సంబంధించి మరో కాంట్రవర్సీకి కేంద్ర బిందువయ్యారు. అసలు జగన్ రెడ్డి దావోస్ పర్యటన సమాచారం అధికారులకు తెలియదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అంతేకాదు, దావోస్ కు వెళ్లిన విమాన ప్రయాణ ఖర్చుల బిల్లులు ఇప్పటిదాకా తమకు అందలేదని ఆర్ధికాభివృద్ది బోర్డు షాకింగ్ నిజం వెల్లడించింది. జగన్ లండన్ ఎందుకు వెళ్లారో తమ దగ్గర వివరాలు లేవని ఆ బోర్డు చేతులెత్తేసింది. ఇక, వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు మే 26వ తేదీన ముగిసిందని, కానీ, మే 31వ తేదీ వరకూ జగన్ ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారో తమకు తెలీదని తేల్చి చెప్పేశారు. ఇక, ఇంతా చేసి దావోస్ పర్యటనలో జగన్ కేవలం 4 ఒప్పందాలే కుదుర్చుకున్నారని అధికారులు చెబుతున్నారు.
ఇక, ఆ ఒప్పందాల మీద కూడా జగన్ సంతకం లేకపోవడం కొసమెరుపు. ఆ నాలుగు ఒప్పందాలలో రెండు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఏపీ, తెలంగాణకు చెందినవే కావడం, వాటితో ఒప్పందం కోసం కోట్లు తగలేసి దావోస్ కు వెళ్లడం అసలు ట్విస్ట్. సమాచార హక్కు చట్టం కింద ఆర్ధికాభివృద్ది బోర్డు అధికారులు ఈ సమాచారం వెల్లడించక తప్పలేదు. దీంతో, జగన్ దావోస్ టూర్ గుట్టు రట్టయింది.
Comments 1